స్వాతంత్ర్యానికి పూర్వం మన దేశాన్ని పాలించిన బ్రిటన్ దేశం కరోనా దెబ్బకు కుదేలైందా? తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయిదా? జీడీపీ ఢమాల్ తో దివాళా తీసిందా? అంటే ఔననే అంటున్నాయి బ్రిటన్ ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ డేటా.
తాజాగా బ్రిటన్ ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ డేటా విడుదలైంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం ఏప్రిల్-జూన్ లో బ్రిటన్ దేశ ఆర్థిక వ్యవస్థ ఏకంగా మైనస్ 20.4శాతం క్షీణించడం ఆర్థిక పతనంగా ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే 2009లో బ్రిటన్ దేశం ఒకసారి ఆర్థికమాంద్యంలో కూరుకుపోయింది. ఇప్పుడు మరోసారి ఆ దేశానికి కరోనా వల్ల ఈ ఉపద్రవం వచ్చిపడింది.
కరోనా వైరస్ వల్ల ఏర్పడిన మాంద్యం తరువాత బ్రిటన్ జీడీపీ అతిపెద్ద త్రైమాసిక క్షీణతను కలిగి ఉందని నేషనల్ స్టాటిస్టిక్స్ తెలిపింది. ఇప్పటికే జనవరి-మార్చి త్రైమాసికంలో బ్రిటన్ జీడీపీ 2.2శాతంకు పడిపోయింది. ఇతర సంపన్న దేశాలతో పోలిస్తే బ్రిటన్ పరిస్థితి దారుణంగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఏప్రిల్ -జూన్ త్రైమాసికంలో ఫ్రాన్స్ జీడీపీ మైనస్ 18.9శాతం, ఇటలీ మైనస్ 17.1, జర్మనీ మైనస్ 11.9, అమెరికా మైనస్ 10.6శాతంగా ఉంది.
1955 తరువాత బ్రిటన్ జీడీపీ ఇంత దారుణంగా పడిపోవడం ఇదే తొలిసారి. 65 ఏళ్లలో ఇంత దారుణంగా ఎప్పుడూ పడిపోలేదు. సేవారంగం, ఉత్పత్తి రంగం, కన్ స్ట్రక్షన్ రంగం రికార్డ్ స్థాయిలో క్షీణించింది.
లక్షలమంది ఉద్యోగాలు పోయాయని.. గణాంకాలు ఆందోళన కరంగా ఉన్నాయని.. యూకే ఆర్థిక మంత్రి రిషి సునక్ తెలిపారు. మార్చి 24 నుంచి విధించిన లాక్ డౌన్ తోనే బ్రిటన్ ఆర్థిక పతనం మొదలైంది. రాబోయే నెలల్లో నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉందని.. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.