రూ.2వేలు.. రూ.200 నోట్ల‌పై బ్యాడ్ న్యూస్‌

Update: 2018-05-15 04:38 GMT
పెద్ద‌నోట్ల ర‌ద్దు అంటూ ప్ర‌ధాని మోడీ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం నాటి నుంచి పెద్ద నోట్ల ద‌గ్గ‌ర నుంచి ఇటీవ‌ల కాలంలో విచిత్ర‌మైన భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎప్పుడేం జ‌రుగుతుందోన‌న్న సందేహంతో కొంద‌రు ఉండిపోయారు. మ‌రికొంద‌రు రూ.2వేల నోటును ర‌ద్దు చేస్తారంటూ ఆ మ‌ధ్య‌న చ‌ర్చ జోరుగా సాగింది.

అయితే.. ఇందులో నిజం లేద‌ని.. రూ.2వేల నోట్ల ర‌ద్దుపై ఎలాంటి సందేహాలు అక్క‌ర్లేద‌న్న వివ‌ర‌ణ వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. రూ.2వేలు..కొత్త‌గా విడుద‌లైన రూ.200 నోట్ల‌కు సంబంధించి షాకింగ్ నిజం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. రూ.2వేలు.. రూ.200 నోట్లకు సంబంధించి నోటు చినిగినా.. ప్రింటింగ్ లోపాలు ఉన్నా.. ఏదైనా రంగు అంటినా ఇక అంతే సంగ‌తులు అంటున్నారు.

ఈ కొత్త నోట్ల‌కు ఏ మాత్రం డ్యామేజ్ జ‌రిగినా.. భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే. ఎందుకంటే.. ఈ రెండు నోట్ల‌ను వెనుక్కి తీసుకోక‌పోవ‌ట‌మే. ఎందుకిలా అంటే ఆర్ బీఐ రూల్స్ ను ప్ర‌స్తావిస్తున్నారు. ఇప్పుడున్న ఆర్బీఐ చ‌ట్టం ప్ర‌కారం.. రూ.2వేలు.. రూ.200 నోట్ల‌కు ఏ మాత్రం డ్యామేజ్ జ‌రిగినా వాటిని వెన‌క్కి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు. ఆర్ బీఐ చ‌ట్టంలోని సెక్ష‌న్ 28ను మార్చాల్సి ఉంది. అప్పుడే ఈ రెండు నోట్ల‌కు ఏదైనా డ్యామేజ్ జ‌రిగితే బ్యాంకులు వెన‌క్కి తీసుకొని అందుకు బ‌దులుగా వేరే నోట్లు ఇచ్చే వీలుంది.

సెక్ష‌న్ 28లో రూల్ ప్రకారం క‌రెన్సీ నోట్ల మార్పిపై ప్ర‌స్తావిస్తూ రూ.5.. రూ.10.. రూ.100.. రూ.1000.. రూ.10,000 నోట్ల గురించి మాత్ర‌మే పేర్కొన్నారు. ఇందులో రూ.2వేలు.. రూ.200 నోట్లు లేక‌పోవ‌టం.. మోడీ స‌ర్కారు వాటిని తీసుకురావ‌టంతో తేడా ఉన్న నోట్ల‌ను ప్ర‌భుత్వం తీసుకోక‌పోవ‌ట‌మే కాదు.. అవి ఎందుకు ప‌నికి రావ‌ని తేల్చి చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆర్ బీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 28ని త‌క్ష‌ణ‌మే మార్చాల‌ని చెబుతున్నారు. మ‌రి.. ఈ మార్పుపై ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదాలు ప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత చిన్న విష‌యాన్ని మార్చేందుకు అన్నేసి నెల‌లు టైం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏముంది మోడీజీ?
Tags:    

Similar News