బ్యాంకు దోపిడీ

Update: 2017-03-31 07:13 GMT
బ్యాంకు దోపిడీ అనగానే ఎవరైనా ఏమనుకుంటారు.. దొంగలు ఏదో బ్యాంకుకు కన్నమేసి కోట్లు విలువ చేసే నోట్ల కట్టలు కొట్టేసి ఉంటారనుకుంటారు. కానీ.. ఇప్పుడు బ్యాంకు దోపిడీ అనే పదానికి అర్థం మారిపోయింది. చాలా బ్యాంకుల్లో పటిష్ఠమైన భద్రతావ్యవస్థలు ఉండడం ఒక కారణమైతే.. ఇండియా డిజిటల్ ట్రాంజాక్షన్ల దేశం అయిపోతే అప్పుడ కరెన్సీ లేక దొంగలు కొట్టేయడానికి కూడా బ్యాంకుల్లో ఏమీ ఉండదు. అయితే.. బ్యాంకులే ఇప్పుడు ప్రజలను దోచుకునే రోజులొచ్చేశాయి. మంచి రోజు చూసుకుని ఆర్థిక సంవత్సరం ప్రారంభ తేదీ అయిన ఏప్రిల్ 1 నుంచి జనాల్ని దోచుకోవడానికి బ్యాంకుల ముఠా సిద్ధమైపోయింది.  అంతా నంబర్ గేమ్ తో జేబులు కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నారు.
    
ఖాతాలో డబ్బుండి దాన్నుంచి ఏటీఎంలో తీసినా, చెక్ ఇచ్చినా, ఇలా ఏం చేసినా పరిమిత పర్యాయాల కంటే ఎక్కువసార్లు ట్రాంజాక్ట్ చేస్తే ఫీజులు బాదేస్తారు. అలా అని ఖాతాలో డబ్బులు లేకపోతే ఊరుకుంటారా... ఖాతాలో కనీస నిల్వలు మెంటైన్ చేయనందుకు ఛార్జీలు వసూలు చేయబోతున్నారు. మొత్తానికి బ్యాంకు కస్టమర్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది.
    
బ్యాంకుల తీరుపై ప్రజల నుంచి వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక ఈ వ్యతిరేకత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఛార్జీలు ఏదో కొద్ది మొత్తంలో ఉండడం లేదు. భారీగా ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే నేరం చేసేవాళ్లకు వేసే జరిమానాలా అన్న అనుమానం కలిగిస్తున్నాయి. బ్యాంకులు కూడా వ్యాపార సంస్థలు వంటివే.. ఏ వ్యాపారానికైనా లాభాలు ఎంత ముఖ్యమో కస్టమర్ సేటిస్ఫేక్షన్ కూడా అంతే ముఖ్యం.  బ్యాంకుల పాలిట బంగారు బాతుల్లా ఉన్న కస్టమర్ల కడుపు కోయాలనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News