తెలుగు సాంస్కృతిక కళా వైభవానికి ప్రతీకగా రాజధాని అమరావతిలో ఒక కళా కేంద్రం రూపుదిద్దుకోనుంది. కళ్లు చెదిరే కళా ఖండాలతో అమరావతి శిల్ప అపురూప కళా నైపుణ్యంతో దీనిని తీర్చిదిద్దనున్నారు. సీడ్ కేపిటల్ ప్లాన్ లోనే సింగపూర్ నిపుణులు దీనిని రూపకల్పన చేశారు.
నదీ పరీవాహక ప్రాంతమైన తాళ్లాయపాలెం రేవు సమీపంలో దీనిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నృత్య, జానపద, రంగస్థల, సాంస్కృతిక, చారిత్రక వైభవాలను చాటి చెబుతూ, కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో కృష్ణా తీరంలో అద్భుత కళా కేంద్రం నిర్మించాలని చంద్రబాబు భావించారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతి తరహాలో రాజధానిలో ప్రభుత్వ పరంగా నిర్వహించే అన్ని కార్యక్రమాలూ దానిలోనే నిర్వహిస్తారు. ఈ కేంద్రానికి బాపు-రమణల పేర్లు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. దానిని కృష్నా నది ఒడ్డున నిర్మించాలని తాజాగా నిర్ణయించారు.