చైనాను బోనులో దోషిగా నిలబెట్టాల్సిందే !

Update: 2020-05-19 00:30 GMT
అత్యంత భయంకరమైన మహమ్మారి‌ వ్యాప్తికి చైనానే కారణంటూ అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలు గట్టిగా వాదిస్తున్నాయి. మహమ్మారి పై కుట్రపూరితంగా వ్యవరించినందుకు చైనా నుంచి పెద్ద మొత్తంలో నష్టపరిహారం రాబట్టాలంటూ యూఎస్‌ తో సహా ఐరోపా ఖండంలోని పలు దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే చైనా నుండే ఈ మహమ్మారి ‌ లీక్‌ అయిందనే ఆరోపణలపై భారత ప్రభుత్వం ఇంత వరకు స్పందించలేదు. ఈ క్రమంలోనే వైరస్‌‌ వ్యాప్తికి కారణమైన డ్రాగన్‌ ను కోర్టుకు ఈడ్చాలంటూ భారతీయ న్యాయవాదులు సైతం ప్రణాళికలు రచిస్తున్నారు.

ఈ  మహమ్మారి ముమ్మాటికీ చైనా సృష్టే అని, దానికి ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని లాయర్లు హెచ్చరించారు. చైనా నుంచి పెద్ద మొత్తంలో నష్టపరిహారం రాబట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆల్‌ ఇండియా బార్‌ అసోషియేషన్‌ నేతృత్వంలోనే న్యాయవాదులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. భారతీయ న్యాయ చట్టాల ప్రకారం విదేశాలపై ఎలాంటి దావా వేయడానికి వీలులేదు. ఈ క్రమంలో సివిల్‌ ప్రొసిజర్‌ కోడ్‌ (సీపీసీ) లోని సెక్షన్‌ 86ను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

చైనాపై పిటిషన్‌ వేసేందుకు వీలుగా చట్టంలో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు.  చైనా పన్నిన కుట్రకు భారత్‌ తో పాటు ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున పౌరుల ప్రాణాలను కోల్పోయాయని, దీనికి ఆ దేశం శిక్ష అనుభవించాల్సిందేనని న్యాయవాదులు లేఖలో ఆరోపించారు. ఇప్పుడు దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News