మోడీ సొమ్ముతో మ‌హిళ‌ల ఎంజాయ్‌మెంట్‌.. మామూలుగా లేదుగా!

Update: 2023-02-08 10:16 GMT
రాష్ట్రాలైనా కేంద్ర ప్ర‌భుత్వమైనా.. ప్ర‌జ‌ల‌కు సాయం చేస్తుంటాయి. ల‌బ్ధి దారుల‌ను ఎంపిక చేసి.. వారికి ప్ర‌యోజ‌న‌కరంగా ఉండేందుకు ఏదో ఒక కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే కేంద్రంలో ని న‌రేంద్ర మోడీ స‌ర్కారు పీఎంఏవై(పీఎం ఆవాస్ యోజ‌న‌) కింద ఇళ్లు లేని పేద‌ల‌కు డ‌బ్బులు ఇచ్చి ఇళ్లు క‌ట్టుకోమ‌ని ప్రోత్స‌హిస్తోంది. అయితే.. ఇలా ఇస్తున్న సొమ్మును మెజారిటీగా మ‌హిళ‌ల ఖాతాల్లోనే వేస్తున్నారు.

ఇది మ‌హిళా సాధికార‌త‌కు పెద్ద‌పీట వేస్తున్నామ‌ని చెప్పుకొనేందుకు.. వారి ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకునేందుకు కూడా రెండు ర‌కాలుగా వినియోగ‌ప‌డుతోంది. అయితే.. ఇక్క‌డే దీనిని కొంద‌రు మ‌హిళ‌లు త‌మ‌కు అవ‌కాశంగా మార్చేసుకున్నారు.

పీఎంఏవై కింద స‌ర్కారు ఇచ్చిన సొమ్మును.. తీసుకుని.. ఏకంగా భర్త‌ల‌ను, పిల్ల‌ల‌ను కూడా వ‌దిలేసి.. ప్రియుల‌తో జంప్ అయిపోయారు. కాస్కో నారాజా! అంటూ.. ల‌వ‌ర్స్‌తో లేచిపోయారు.

ఉత్తర్ప్రదేశ్లో ఐదుగురు మహిళల నిర్వాకం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లాలో కట్టుకున్న భర్తలను వదిలేసి.. ప్రభుత్వ పథకం కింద వచ్చిన సొమ్ముతో తమ ప్రియులతో పారిపోయారు ఐదుగురు మహిళలు. పీఎంఏవై పథకం ద్వారా వచ్చిన మొత్తాన్ని తీసుకొని మహిళలు జంప్ అయ్యారు.

ఆవాస్ యోజన కింద.. భూమి ఉన్న నిరుపేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. మొదటి విడత కింద రూ.50,000, రెండో విడతలో రూ.1,50,000 చివరగా మూడో ఇన్స్టాల్మెంట్ కింద మరో రూ.50,000లను మహిళల బ్యాంకు ఖాతాల్లో జమా చేస్తోంది.  ఈ క్ర‌మంలోనే బారాబంకీ జిల్లాలో మొదటి ఇన్స్టాల్మెంట్ కింద రూ.50,000లను మ‌హిళ‌ల‌ ఖాతాల్లో జమ‌ చేశారు.

ఇక అకౌంట్లలో నగదు పడ్డ వెంటనే ఐదుగురు మహిళలు తమ భర్తలను, బిడ్డ‌ల‌ను కూడా వదిలేసి ప్రియులతో కలిసి లేచిపోయారు. ఇదీ.. సంగ‌తి!!  ఇక్క‌డ అస‌లు సిస‌లు ట్విస్ట్ ఏంటంటే.. భార్య‌లు లేచిపోయార‌ని ల‌బోదిబో మంటున్న భ‌ర్త‌ల‌కు.. స‌ద‌రు సొమ్మును చెల్లించాలంటూ.. క‌లెక్ట‌ర్లు నోటీసులు పంపించ‌డ‌మే!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News