అటెండర్లతో వెట్టిచాకిరీ.. అధికారి దుర్మార్గం

Update: 2020-08-06 04:30 GMT
కడిగితే ఏదైనా కడిగించుకునేలా ఉన్నాడు ఈ అధికారి. అధికార దర్పంతో అటెండర్లతో కాళ్లు పట్టించుకుంటూ.. బాత్రూంలు కడిగిస్తూ.. నానా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు. ప్రశ్నిస్తే ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనతో ఆ అటెండర్లు మిన్నకుండిపోతున్నారు. ఈ దారుణం ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది.

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం చింతలపాలెం వద్ద ఉన్న వెలుగొండ ప్రాజెక్టు భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో దారుణాలు వెలుగుచూశాయి.  అటెండర్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న అతడి బాగోతాలను ఎవరో స్థానికులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దారుణాలు అందరికీ తెలిశాయి.

లుగొండ ప్రాజెక్టు భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో ఐదుగురు అటెండర్లు ఉన్నారు. వీరిని ఎస్డీసీ విజయ్ కుమార్ తన వ్యక్తిగత పనులకు ఉపయోగించుకుంటున్నాడని ఫొటోలు, వీడియోల్లో కనిపించింది. విజయ్ కుమార్ కాళ్లను అటెండర్లు ఒత్తుతూ.. బాత్రూంలు కడిగిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉద్యోగాలు పోతాయనే భయంతో అటెండర్లు కూడా నిమ్మకుండిపోతున్నారని తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
Tags:    

Similar News