ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తోడు, ఎగువ ప్రాంతాల్లోనూ భారీగా పడుతున్న వానలు, ఉప్పొంగుతున్న కొండ వాగులు, వంకలు, ఉపనదులతో గోదావరి ప్రళయ రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఏపీలో నాలుగు జిల్లాలు గోదావరి వరదల పాలిట పడ్డాయి. పంటలు నీట మునిగాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఈ వరదలపై ప్రస్తుతం అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. వరద ప్రవాహాన్ని అంచనా వేయడంలోనూ, వరద బాధితులకు, రైతులకు సహాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.
మరోవైపు అధికార పార్టీ నేతలేమో ఎప్పటిలానే ఇది ప్రతిపక్షాల కుట్ర అని, ఎల్లో మీడియా పత్రికలు, టీవీ చానెళ్లు తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నాయని నిప్పులు చెరుగుతున్నారు. తాము వరద బాధితులను ఆదుకుంటూనే ఉన్నామని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా తాజాగా అధికారులకు, వైఎస్సార్సీపీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. వరదలపై రాజకీయం చేయడానికి పవన్ కల్యాణ్, చంద్రబాబులతోపాటు రెండు పత్రికలు, మూడు టీవీ చానెళ్లు కాసుకు కూర్చున్నాయని.. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు, వైఎస్సార్స్సీపీ ప్రజాప్రతినిధులు ఏమాత్రం అలక్ష్యంగా ఉన్న వారు దుష్ప్రచారం చేస్తారని జగన్ అంటున్నారు.
గతంలో ఎప్పుడూ కూడా వరద బాధితులకు ఏ ప్రభుత్వం రూ.2 వేల ఆర్థిక సహాయం చేయలేదన్నారు. వరద బాధితులకు సహాయం చేయడానికి విరామం ఎరుగకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని జగన్ తెలిపారు. అలాంటి వారిలో నైతిక స్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని విపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలు, ఎల్లో మీడియా ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా రాష్ట్ర ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. వరదలోనూ బురదజల్లడానికి నానారకాలుగా ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. దురుద్దేశ పూర్వకంగా చేసే ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులకు సూచించారు. వదంతులను కూడా తిప్పికొట్టాలన్నారు.
రాష్ట్రంలో గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయం నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇందులో 6 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం మాట్లాడారు. గోదావరి వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోందని, అయితే వర్షాల కారణంగా ఇబ్బందులు తప్పడం లేదని ఆయన తెలిపారు. కాబట్టి నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.
రానున్న 48 గంటల్లో ఏ ఇల్లు కూడా మిగిలిపోకుండా రూ.2 వేల సహాయం వెంటనే అందించాలన్నారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో బంగాళాదుంపలు, కిలో ఉల్లిపాయలు, కిలో పామాయిల్‌తో కూడిన రేషన్ పంపిణీ జరగాలని సీఎం సూచించారు.