ఏపీలో వైసీపీ ప్రభుత్వం గురించి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనికి కారణం.. ఏంటి? సహజంగా ప్రతిపక్షం కాబట్టి ఆందోళన చేస్తోందా? లేక.. ఇంకేదైనా కారణం ఉందా? అంటే.. రాష్ట్రం పట్ల, రాష్ట్ర భవితవ్యం పట్ల.. టీడీపీ ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. చేతికి ఎముకలేదన్నట్టుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును ఏమాత్రం లెక్కలోకి తీసుకోకపోవడంపైనే టీడీపీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సంక్షేమ పథకాలకు ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదు.
అయితే.. సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం.. కనీసం రోజువారీ ఖర్చులకు కూడా ప్రభుత్వం వెతుక్కోవడం.. దీనికి సంబంధించి ప్రజలపై పన్నుల భారాలు మోపడం.. పేదలపై భారాలు వేయడం.. మద్యం నిషేధిస్తామని చెప్పి..వచ్చే 25 ఏళ్లపాటు మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయాన్ని అడ్డు పెట్టుకుని మరింత గా అప్పులు చేయడం వంటి అంశాలపైనే బాధ్యతాయుత విపక్షంగా టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోందని అంటున్నారు రాజకీయ మేధావులు. ఇటీవల రాజ్యసభలో టీడీపీ ఎంపీ.. కనకమేడల రవీంద్రకుమార్.. ఇదే అంశాలను ప్రస్తావించారు.
ఏపీలో పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, శాంతి భద్రతలు అధ్వానంగా తయారయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు మాత్రమేఅయిందని... ఈ మధ్య కాలంలోనే ఎన్నడూ లేని విధంగా 3.50 లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసిందని పేర్కొన్నారు. అంతేకాదు.. కేవలం అప్పులు చేసేందుకే కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని ఇది అత్యంత దారుణమైన అంశమని.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా చేయడం లేదని కనకమేడల పేర్కొన్నారు. అంతేకాదు.. ఏకంగా గవర్నర్‌ను సైతం వ్యక్తిగత హామీ దదారుగా చేర్చి అప్పులు తీసుకునే దుస్థితిలోకి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రోజువారీ ఖర్చులకు అవసరమయ్యే నిధులను సమీకరించే ప్రయత్నం చేయకుండా... ఈ భారాన్ని పేదలపై ఓటీఎస్ రూపంలో వేసిందని కనకమేడల సభకు తెలిపారు. ఎప్పుడో 30 ఏళ్ల కిందట పేదలకు ప్రబుత్వాలు కట్టించిన ఇళ్లకు ఇప్పుడు రూ.10 వేలు, రూ.15 వేలు చొప్పున వసూలు చేస్తున్నారని.. చెత్తపై పన్ను విదిస్తున్నారని.. కనకమేడల ఆందోళన వ్యక్తం చేశౄరు. మద్య నిషేధం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పుడు దానిపైనే అప్పులు చేస్తున్నారని సభకు వివరించారు. సో.. ఇలా.. టీడీపీ వ్యవహారం గమనిస్తే.. రాష్ట్ర భవితవ్యం కోసం.. పార్టీ ఆందోళన చెందుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.