భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ బాధ్యతలను ఆయనే చూసుకోనున్నారు. 2020 జవవరి 20 నుంచి జేపీ నడ్డా పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ దేశంలో పలు కీలక కార్యక్రమాలు చేపట్టింది. కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడానికి నడ్డా తీసుకున్న నిర్ణయాలేనని పార్టీ నాయకులు అంటున్నారు. అందుకే ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా అయినా ఆయన వెనుక నడిపిస్తున్నది అమిత్ షా అన్నది సీక్రెట్ చర్చ. ప్రభుత్వం తరుపునే కాకుండా పార్టీ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు అమిత్ షా తీసుకున్నవే. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా అమిత్ షా తన వ్యూహంతో చక్కబెడుతాడు. అసలు జేపీ నడ్డా పదవి పొడగింపునకు అమిత్ షా నే కారణమన్నది హాట్ టాపిక్..
2014 లో అధికారంలోకి వచ్చిన తరువాత భారతీయ జనతా పార్టీ.. తొమ్మిదేళ్ల కాలంలో తిరుగులేని శక్తిగా మారింది. మొదట్లో ప్రధాన ప్రతిపక్షంగా బలంగా ఉన్న కాంగ్రెస్ ను సైతం బీజేపీ తన చాకచక్య వ్యూహంతో దెబ్బ కొడుతూ వస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలను ఆకర్షించి అధికారంలోకి రావడం ఒక ఎత్తయితే.. అప్పటికీ కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలను చేజిక్కించుకోవడం మరో వ్యూహం. ఇలా ఉత్తరాది మొత్తం దాదాపు కాషాయ జెండా ఎగురవేయడానికి మోదీ త్రయం అనగా మోదీతో పాటు అమిత్ షా, నడ్డా వ్యూహాలు బాగా పనిచేశాయని చెప్పుకుంటున్నారు. అయితే వీరిలో అమిత్ స్కెచ్ తోనే వ్యవహారాలన్నీ నడుస్తాయని అనుకుంటున్నారు.
తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలం పొడగింపుపై ఓ వర్గం అసంతృప్తిగానే కనిపిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ఎందరో మహా మహులు ఉండగా జేపీ నడ్డానే ఎందుకు కనిపిస్తున్నారని కొందరు గుసగుసలాడుతున్నారు.
అయితే సార్వత్రిక ఎన్నికలకు ఇంచు మించు మరో ఏడాది కాలం ఉంది. ఈ సమయంలో కొత్త అధ్యక్షుడిని నియమిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని అమిత్ షానే మోదీకి సూచించినట్లు సమాచారం. పైకి జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అమిత్ షానే ఉంటారు. ఇతర వ్యక్తులయితే వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల ముందు నడ్డాను ఉంచి.. వెనక నుంచి అమిత్ షా నడిపించే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దక్షిణాదిలో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో తెలంగాణను ఎంచుకుంది. గత రెండు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధిస్తోంది. అందుకు జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డానే కారణమని జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ అన్నారు. అయితే రాష్ట్రంలో పార్టీ బలపడడానికి వివిధ కారణాలున్నాయి. వీరికి అధిష్టానం సపోర్టు ఉండొచ్చు. కానీ జేపీ నడ్డాతోనే తెలంగాణలో బీజేపీ బలపడుతుందనేది వాస్తవమేనా..? అన్న చర్చ సాగుతోంది.
ఇంకోవైపు తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో అధ్యక్షుడిగా మరో వ్యక్తిని నియమిస్తే అక్కడున్న బండి సంజయ్ కి సపోర్టు ఉండకపోవచ్చు. మరోవైపు అమిత్ షాకు బండి సంజయ్ ప్రియమైన వ్యక్తి. ఈ నేపథ్యంలో జేపీ నడ్డాను కొనసాగిస్తేనే తెలంగాణకూ లాభం జరుగుతుంది. ఇవన్నీ కారణాలతోనే జేపీ నడ్డాను అధ్యక్షుడిగా కొనసాగించేలా ప్రణాళిక వేశారని అనుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.