రాజమండ్రికి దగ్గర్లో ఇటీవల కలకలం రేపిన శిరోముండనం బాధితుడు ప్రసాద్ ను పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాప్ నాటకం అని.. తేల్చి పోలీసులు తెరదించారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్ కిడ్నాప్ డ్రామా ఆడాడని పోలీసులు కనిపెట్టి తెరదించారు.
తనను ఎవరో బెదిరించారని.. ఈ అవమానం భరించలేకపోతున్నానని ప్రసాద్ తన భార్య కౌసల్యకు చెప్పి బైక్, సెల్ ఫోన్ ఇంటి వద్ద విడిచిపెట్టి రెండు రోజుల క్రితం ఎక్కడికో వెళ్లిపోయాడు. దీనిపై భార్య కౌసల్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రసాద్, అతడి స్నేహితుడు పినిపే సందీప్ కాకినాడ సమీపంలోని రాయుడుపాకలు వద్ద ఉన్నట్టు కనుగొన్నారు. అక్కడికెళ్లి ఇద్దరినీ పట్టుకొని విచారించగా సంచలన విషయాలు వెలుగుచూశాయి.
కొంతమంది ఇచ్చిన ఆదేశాలతోనే పక్కా వ్యూహంతో ఈ కిడ్నాప్ డ్రామా ఆడానని ప్రసాద్ తెలిపారు. కులాల మధ్య చిచ్చు పెట్టి.. సోషల్ మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతోనే ఈ విధంగా చేసినట్టు తెలిపాడు.
దీనిపై లోతైన దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కుల వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించిన మరికొంతమందిని తమ దర్యాప్తులో కనుగొన్నామని.. మరిన్ని సాక్ష్యాధారాలతో వారిని అరెస్ట్ చేయనున్నామని పోలీసులు తెలిపారు.