కేసీఆర్ వ్యూహం వెనుక!

Update: 2022-02-14 04:01 GMT
పార్టీలు మూడు ర‌కాలు..గావ‌ర్గీక‌రిస్తే పై విధంగా ప్రాంతీయం కోటా నుంచి ఉప ప్రాంతీయ కోటాలోకి వ‌చ్చింది టీడీపీ. ఉప ప్రాంతీయం కోటా నుంచి జాతీయం వ‌ర‌కూ ఎద‌గాల‌నుకుంటోంది టీఆర్ఎస్. జాతీయం నుంచి సున్నా స్థానానికి దిగ‌జారి మ‌నుగ‌డ కోసం దేవులాడుతోంది కాంగ్రెస్.. ఇది క‌దా విప‌త్క‌రం అంటే!

తెలంగాణ రాష్ట్ర స‌మితి అన్న‌ది ఓ ఉప ప్రాంతీయ పార్టీ. తెలంగాణ సాధ‌న అన్న‌దే ప్ర‌ధాన ధ్యేయం అని భావించి, సంక‌ల్పించి సాధించిన పార్టీ. త‌రువాత కాలంలో టీఆర్ఎస్ క్రియాశీల‌కంగా  మ‌రింత‌గా మారింది. ఉద్య‌మ పార్టీ కాస్త ఫ‌క్తు రాజ‌కీయ పార్టీగా మారి గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కూ ఓ మోస్త‌రు స్థాయి నుంచి అనూహ్య గుర్తింపు అన్న‌ది అందుకుంది. ఆ పార్టీలో హ‌రీశ్ రావు, రామారావు (కేటీఆర్), క‌విత, సంతోష్ లాంటి సొంత మ‌నుషుల ద‌గ్గ‌ర నుంచి త‌ల‌సాని, నామా, పువ్వాడ వంటి నేత‌ల వ‌ర‌కూ అంతా ఎంతో  గుర్తింపు అందుకున్నారు.

ఉద్య‌మంలో లేని వ్య‌క్తుల‌కు ప‌ద‌వులు ఇచ్చి గౌర‌వించిన దాఖలాలు ఉన్నా అదంతా రాజకీయంలో భాగ‌మేన‌ని తేల్చేశారు కేసీఆర్. ఆ విధంగా త‌ల‌సాని లాంటి పెద్ద‌లు, దానం నాగేంద‌ర్ లాంటి పెద్ద‌లు ఇంకా చాలా మంది పెద్ద‌లు ఇవాళ అక్క‌డ ఉన్నారు.

గతంలో నారా చంద్ర‌బాబు ప్రధాన అనుచరుడిగా ఉన్న  నామా నాగేశ్వ‌ర‌రావు కూడా అక్క‌డే ఉన్నాడు. ఇక పార్టీ బ‌లోపేతానికి కేసీఆర్ నుంచి కేటీఆర్ వ‌ర‌కూ కృషి చేస్తున్న తీరులో వీరు ఎంత వ‌ర‌కూ క‌లిసి వ‌స్తారో అన్న‌ది మాత్రం సందేహమే!

ఈ నేప‌థ్యంలో కొత్త పార్టీ ఒక‌టి జాతీయ స్థాయిలో తీసుకువ‌స్తానని అంటున్నారు కేసీఆర్. ఆయ‌న ఎప్ప‌టి నుంచో దేశ రాజ‌కీయాల్లో రాణించాల‌న్న క‌ల‌కు సాకార రూపంగానే కొత్త పార్టీ ఆవిర్భావం అన్న‌ది సుస్ప‌ష్టం. ఆ విధంగా ఆయ‌న ఆంధ్రా రాజ‌కీయాల్లో అడుగు పెట్ట‌నున్నారు. ఆ విధంగా చేస్తేనే క‌దా! అస‌లు తెలుగు రాష్ట్రాల‌లో కేసీఆర్ హ‌వా ఎంత‌న్న‌ది అప్పుడే క‌దా స్ప‌ష్టం అయ్యేది. క‌నుక ఎప్పుడో కార్మిక శాఖ మంత్రిగా ప‌నిచేసిన రోజుల నుంచి ఇప్ప‌టిదాకా కేసీఆర్ ఢిల్లీ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేయాల‌న్న‌ది త‌ప‌న.

ఆ త‌ప‌న‌లోభాగంగా మోడీని ఢీ కొనే ప్ర‌య‌త్నంలో భాగంగా కేసీఆర్ చేస్తున్న ప్ర‌యత్నాల్లో భాగంగా ఆయ‌న ఎంత వర‌కూ స‌క్సెస్ కానున్నారో అన్న‌ది ముందున్న‌కాల‌మే తేల్చాలి.
Tags:    

Similar News