అవినీతి.. అశ్రిత పక్షపాతం లాంటివి అస్సలే ఉండవని ఢంకా బజాయించి చెప్పే మోడీ సర్కారులో చోటు చేసుకున్న లోపం ఒకటి బయటకు వచ్చింది. వాస్తవానికి మోడీ సర్కారుకు ముందు చోటు చేసుకునే తప్పుల్లో ఎక్కువ భాగం బయటకు వచ్చేవి.
కానీ.. మోడీ వారి నైపుణ్యం కారణంగా.. అలాంటివి బయటకు రాని పరిస్థితన్న విమర్శ ఉంది. అప్పుడప్పుడు అధికారికంగా చేపట్టే విచారణ సందర్భంగా బయటకు రావటమే కానీ.. మీడియాలో ఫలానా విషయంలో మోడీ సర్కారు చేసిన తప్పు ఇంతలా ఉందన్న విషయాన్ని చెప్పిన పాపాన పోయింది లేదు.
తాజా విషయానికి వస్తే.. మోడీ మానసపుత్రికల్లో ఒకటైన ‘బేటీ బచావో బేటీ పడావో’ పథకానికి సంబంధించిన పార్లమెంటరీ ప్యానెల్ తీవ్రంగా తప్పు పట్టింది. ఆడపిల్లల కోసం కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకానికి సంబంధించిన తప్పుల్ని ఎత్తి చూపింది.
2016-19 మధ్యన ఈ పథకం కోసం కేటాయించిన నిధుల్లో అత్యధిక భాగంగా పథకం అమలు కంటే కూడా.. పథకాన్ని ప్రచారం చేయటానికే ఎక్కువగా వినియోగించటం విశేషం. మూడేళ్ల వ్యవధిలో ఈ పథకం కోసం నిర్దేశించిన మొత్తం రూ.446.72 కోట్లు కాగా.. అందులో 78 శాతం నిధులు మీడియాలో ప్రచారానికే ఖర్చు చేసిన వైనాన్ని గుర్తించారు.
ఈ పథకం గురించి మీడియాలో ప్రచారం చేసుకునే కన్నా.. దాన్ని ఆడపిల్లల చదువు.. ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచన చేసింది. అంతేకాదు.. ఈ పథకం అమలుకు సంబంధించిన పలు సూచనలు చేస్తూ.. తన నివేదికను లోక్ సభకు సమర్పించింది. ఈ పథకాన్ని ఆడపిల్లల రక్షణ.. వారి విద్య కోసం చేపట్టారని.. కానీ.. ఈ పథకం ద్వారా ఆ లక్ష్యాలు ఏమీ నెరవేరలేదని స్పష్టం చేసింది. ఆడపిల్లల ఉన్నతి కోసం పాటుపడుతున్నామన్న ఇమేజ్ తీసుకురావటానికే ఈ పథకం ఉపయోగించిందని కాస్తంత ఘాటుగానే రియాక్టు అయ్యింది.
నిజానికి ఇలాంటి గొప్ప పథకాన్ని కేవలం ప్రచారం కోసం కాకుండా.. అసలు లక్ష్యం కోసం పని చేయాలని కేంద్రానికి సూచన చేసింది. అంతేకాదు.. జిల్లా స్థాయిలో పథకం అమలు తీరుపై ప్రతి మూడు నెలలకు ఒకసారి రివ్యూ చేయాల్సి ఉన్నా.. అలాంటిదేమీ జరగలేదని పేర్కొంది. పాలనా విషయంలో మోడీ సర్కారును వంక పెట్టే అవకాశమే ఉండదని గొప్పలు చెప్పుకునే వారు.. తాజా నివేదికపై ఎలా రియాక్టు అవుతారో?