గుడ్​ న్యూస్​... బూస్టర్​ డోస్​ తో మెరుగైన రక్షణ..!

Update: 2022-01-21 07:51 GMT
కరోనా వైరస్​ కేసులు ప్రపంచ వ్యాప్తంగా భారీగా నమోదు అవుతున్నాయి. లక్షల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. కేవలం ఒక్క రోజులోనే 34 లక్షల కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదు అయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. కేసులు భారీగా నమోదుకావడం ఒకవైపు అధికారులను కంగారు పెడుతున్నా.. మరో వైపు గతంలో లాగా  మరణాలు సంఖ్య భారీగా పెరగక పోవడం ఒకింత ఊపిరి తీసుకునేలా చేస్తుంది.

ఈ నేపథ్యంలో లాన్సెట్​ జర్నల్​ ప్రపంచానికి ఓ  శుభవార్త చెప్పింది. కరోనా మూడో టీకా తీసుకోవడం ద్వారా ప్రజలు వైరస్​ నుంచి త్వరగా బయటపడుతున్నాట్లు పేర్కొంది. బూస్టర్​ డోసు తీసుకున్న వారిలో యాంటీ బాడీలు ఎక్కువగా ఉండి వైరస్​ నుంచి బయట పడేందుకు కారణంగా చూపిస్తున్నట్లు చెప్పింది. కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ ను ఎదుర్కొవడంలో సమర్థవంతంగా ఉన్నట్లు బ్రిటన్​ పరిశోధకలు చేపట్టిన సర్వేలో తెలింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ రీసర్చ్‌ పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయనంలో బూస్టర్​ డోస్​ తీసుకున్న వారిలో యాంటీ బాడీలు ఎక్కువ ఉత్పత్తి అయ్యి వైరస్​ ను తటస్థీకరింస్తున్నట్లు తేలింది. ఇదే విషయాన్ని లాన్సెట్​ ప్రచురించింది.  

ఫైజర్​, ఆస్ట్రాజెనెకా టీకాలు తీసుకున్న వారిలో కొవిడ్​ వేరియంట్లు అయిన అల్ఫా, డెల్టాలతో పోరాడిన దాని కంటే ఒమిక్రాన్​పై ఎక్కువగా పోరాతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మరో వైపు ఈ వ్యాక్సిన్​ లు తీసుకున్న వారిలో కేవలం రెండు నెలల్లోనే యాంటీ బాడీలు తగ్గినట్లు గుర్తించిన పరిశోధకులు.. బూస్టర్​ డోస్ తీసుకోవడం వల్ల మరింత పెరిగినట్లు కనుగొన్నారు. అంతేగాకుండా బూస్టర్​ డోసు తీసుకున్న వారిలో ఎక్కువ మంది వైరస్ బారిన పడినా కానీ ఆసుపత్రి పాలు కాకుండా ఉన్నట్లు గుర్తించారు. ఈ సర్వేలో సుమారు 364 మంది పాల్గొన్నారు. వీరి నుంచి 6 వందలకు పైగా రక్త నమూనాలను  సేకరించి అధ్యయనం చేశారు.
Tags:    

Similar News