గెలుపు గుర్రం... శిల్పా మోహ‌న్ రెడ్డేన‌ట‌!

Update: 2017-08-12 10:21 GMT
నంద్యాల ఉప ఎన్నిక రంజుమీదుంది! మ‌రి కొన్ని రోజేలే ప్ర‌చారానికి అవ‌కాశం ఉండ‌డం - అభ్య‌ర్థుల మ‌ధ్య పోటీ నువ్వా నేనా అనేలా సాగ‌డం దీనికి ప్ర‌ధాన కార‌ణం అయితే, టీడీపీ - వైసీపీ నేత‌లు ఈ ఎన్నిక‌ను తీవ్రంగా ప‌రిగ‌ణిస్తుండ‌డం మరో కార‌ణంగా క‌నిపిస్తోంది. దీంతో పోటీ గ‌తంలో ఎక్క‌డా జ‌ర‌గ‌ని విధంగా సాగుతోంది. అధికార - విప‌క్షాలు ఎవ‌రికివారే త‌మ శ‌క్తి యుక్తుల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. ఈ విష‌యంలో నైతిక‌త‌ను ప్ర‌ధానాస్త్రంగా తీసుకున్న వైసీపీ వైపే జ‌నాలు మొగ్గుతున్న‌ట్టు స‌మాచారం. అదే స‌మ‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్ట‌ని అభివృద్ధి ప‌నులు కేవ‌లం ఉప ఎన్నిక రాగానే చేప‌ట్ట‌డంపై కూడా జ‌నాలు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. అది కూడా ఇప్ప‌డు ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి రావ‌డంతో అవి ఆగిపోయాయి.

దీంతో అధికార టీడీపీది జిమ్మిక్కుల రాజ‌కీయంగా నే స్థానికులు భావిస్తున్నారు. మ‌రోప‌క్క‌, జ‌గ‌న్‌ కు విప‌రీత‌మైన ఫాలోయింగ్ వ‌స్తోంది. ఏ కార‌ణం లేకుండానే జ‌గ‌న్ చంద్ర‌బాబును విమ‌ర్శిస్తారా? అని మ‌హిళ‌లు సైతం చ‌ర్చించుకుంటున్నారు. 2014లో ఇచ్చిన హామీల‌ను నిజంగానే అమ‌లు చేయ‌లేద‌ని మ‌హిళ‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే అంద‌రూ వైసీపీ ప‌క్షానే నిల‌వాల‌ని ఆఫ్ ది రికార్డుగా తెలుస్తోంది. ఇక‌, మ‌రోప‌క్క యువ‌త కూడా ఈ ఎన్నిక‌లపై త‌మ‌దైన మార్కు చూపిస్తున్నారు. వీరికి క‌లిసివ‌స్తున్న అంశం.. జ‌గ‌న‌న్న‌!  అదే  స‌మ‌యంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌నానికి బ్ర‌హ్మానంద రెడ్డి అంటే ఎవ‌రో కూడా తెలియ‌క పోవ‌డం టీడీపీకి మైన‌స్‌ గా మారిపోయింది.

ఇక‌, శిల్పా మోహ‌న్‌ రెడ్డి విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. స్థానికంగా అనేక స‌మ‌స్య‌ల‌ను ఇటీవ‌ల వ‌ర‌కు ఆయ‌న ప‌రిష్క‌రించారు. దీంతో యువ‌త ఇప్పుడు పెద్ద ఎత్తున శిల్పాకు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, పందేల‌కు పెట్టింది పేరైన నంద్యాల‌లో తాజాగా ఉప ఎన్నిక‌ల పందేలు కూడా తార స్థాయికి చేరిపోయాయ‌ట. గెలుపు మాదేన‌ని వైసీపీ ప‌క్షాన య‌వ‌తే ఘంటా ప‌థంగా చెబుతోంద‌ట‌. ఈ క్ర‌మంలోనే వంద‌ల నుంచి వేల రూపాయ‌ల వ‌ర‌కు పందేల‌కు కూడా రెడీ అయిపోయింద‌ట‌. పందేలు కాయ‌డం చ‌ట్ట విరుద్ద‌మే అయిన‌ప్ప‌టికీ.. దీనిలో ఉన్న మ‌జా వేరేగా ఉంటుంద‌ని అంటోంది యువ‌త‌. ఇక‌, టీడీపీ ప‌క్షాన కూడా కొంద‌రు ముందుకు వ‌స్తున్నా.. బ్ర‌హ్మానంద రెడ్డి నిన్న‌టి వ‌ర‌కు క్రియాశీలంగా లేక‌పోవ‌డంతో పందేలు కాయ‌డానికి జంకుతున్నార‌ట‌.

నిజానికి క‌ర్నూలు జిల్లాలో పందేలు కొత్త‌కాదు. 2014 ఎన్నికల్లో ఈ ఒక్క జిల్లాలోనే వెయ్యి కోట్ల వరకు పందేలు సాగాయి. ముఖ్యంగా నంద్యాల వంటి నియోజ‌క‌వ‌ర్గంపై ఎక్కువ‌గా సాగాయి. దీంతో ఇప్పుడు కూడా పందేలు జోరందుకున్నాయి. వైసీపీ - టీడీపీ ప‌క్షాన యువ‌త పెద్ద ఎత్తున పందేల‌కు దిగుతున్నాయ‌ని స‌మాచారం. అయితే, ప్ర‌స్తుతానికి నోటి మాట ద్వారానే పందేలు సాగుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. శిల్పా గెలుస్తాడ‌ని చెప్పేవారు ఎక్కువ‌గా ఉన్నార‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. మొత్తానికి పందేల విష‌యంలోనూ టీడీపీ కి మ‌ద్ద‌తు ల‌భించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News