మూడో వేవ్ వేళ.. పిల్లలకు వేసేందుకు వీలుగా టీకా కార్యక్రమం దేశంలో సాగుతోంది. ఇలాంటి వేళ.. పిల్లలకు వేయాల్సిన టీకా ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. 15-18 ఏళ్ల మధ్య పిల్లలకు ఇవ్వాల్సిన టీకా.. కొవాగ్జిన్ మాత్రమేనని స్పష్టం చేస్తోంది భారత్ బయోటెక్. తాజాగా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఒక ప్రకటన విడుదల చేసింది.
దీని ప్రకారం.. 15-18 ఏళ్ల మధ్య పిల్లలకు ఇవ్వాల్సిన టీకా గురించి స్పష్టమైన ప్రకటనను చేసింది. పిల్లలకు ఇచ్చే టీకాల విషయంలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ మాత్రమే ఇవ్వాలని చెప్పింది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని పేర్కొంటోంది. పిల్లలకు టీకాలు వేసే ఆరోగ్య కార్యకర్తలతో పాటు.. టీకా వేయించుకునే వారు సైతం.. ఈ విషయాన్ని తెలుసుకోవాలని కోరుతోంది.
అన్ని రకాలుగా పరీక్షించి.. ఫలితాల్ని విశ్లేషించిన తర్వాత కొవాగ్జిన్ టీకాను మాత్రమే పిల్లలకు అనుమతించినట్లుగా చెబుతున్నారు. కొవాగ్జిన్ కు బదులుగా మరే టీకా కూడా వాడకూడదని స్పష్టం చేసింది. సో.. మీ పిల్లలకు వేసే టీకా ఏమిటన్న విషయాన్ని స్పష్టంగా కనుక్కోవటం మర్చిపోవద్దు.