తీపికబురు.. కొవాగ్జిన్ బూస్టర్ ఫలితాల్ని వెల్లడించిన భారత్ బయోటెక్

Update: 2022-01-09 10:30 GMT
అనుకోని విధంగా.. అంచనాలకు భిన్నంగా వచ్చి పడిన థర్డ్ వేవ్ వేళ.. మళ్లీ బూస్టర్ డోసు గురించిన చర్చ ఇప్పుడు ఎక్కువగా జరుగుతోంది. బూస్టర్ డోస్ వేయించుకోవాలా? వద్దా? వేయించుకుంటే కలిగే లాభమేంటి? అనే ప్రశ్నలు ఒక పక్క.. బూస్టర్ డోస్ వేయించుకుంటే.. ఇంతకు ముందు వేసుకున్న టీకానే వేసుకోవాలా? క్రాస్ టీకా వేసుకోవటం ఉత్తమమా? లాంటి సందేహాలు వస్తున్నాయి.

ఇలాంటివేళ.. తమ కొవాగ్జిన్ వ్యాక్సిన్ తో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షించిన భారత్ బయోటెక్.. తాజాగా కొవాగ్జిన్ బూస్టర్ డోసును వేసుకోవాల్సిన అవసరాన్ని.. దానితో కలిగే లాభాల్ని వెల్లడించింది. రెండో డోసు తీసుకున్న ఆర్నెల్లకు కొవాగ్జిన్ టీకా బూస్టర్ డోస్ గా వేసుకుంటే.. కొవిడ్ నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ పేర్కొంది. బూస్టర్ డోస్ కు సంబంధించి తాము నిర్వహించిన క్లినికల్ పరీక్షల వివరాల్ని వెల్లడించింది.

బూస్టర్ డోసును వేసుకున్న వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కనిపించలేదని భారత్ బయోటెక్ వెల్లడించింది. దీనికి సంబంధించి నిర్వహించిన క్లినికల్ పరీక్షలు ఇదే విషయాన్ని నిర్దారించినట్లుగా స్పస్టం చేసింది. బూస్టర్ డోస్ తీసుకున్న 90 శాతం మందిలో కరోనా వైరస్.. ఆల్ఫా.. బీటా.. డెల్టా.. డెల్టాప్లస్ వేరియంట్ లను నిలువరించే యాంటీబాడీ వ్రద్ధి రేటు 5 రెట్లు అధికంగా ఉన్నట్లుగా పేర్కొంది.

బూస్టర్ డోసు వేసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లు.. అలాంటి వారిలో టీ.. బీ సెల్ స్పందనలు బాగున్నట్లుగా గుర్తించారు. ఈ బూస్టల్ డోసు కారణంగా వైరస్ నుంచి దీర్ఘకాలికంగా రక్షణ లభిస్తుందని చెబుతున్నారు. పిల్లలు.. పెద్దలు అన్న తేడా లేకుండా అందరిలోనూ ఒకేలాంటి ఫలితాల్ని కొవాగ్జిన్ టీకా ఇస్తోందని.. భవిష్యత్తులో వెలుగు చూసే మ్యూటేషన్ పైనా మూడుడోసుల కొవాగ్జిన్ టీకా చక్కటి రక్షణ ఇస్తుందని చెబుతోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు బూస్టర్ డోసుగా మొదట వేసుకున్న రెండు టీకాలనే వేసుకోవాలా? వేరే టీకాను వేసుకోవాలా? అన్న ప్రశ్నకు భారత్ బయోటెక్ ఎండీ క్రిష్ణ ఎల్లా సమాధానం ఇస్తూ.. 'ఒకే టీకాను ప్రైమరీ డోసులు.. బూస్టర్ డోసు కింద వినియోగించటానికి.. పెద్దలు.. పిల్లలకు ఇవ్వటానికి అనువుగా ఉండటం ఎంతో సానుకూలం. కొవాగ్జిన్ లో ఈ సానుకూలాంశం ఉంది. ఇది ప్రపంచ టీకా అవుతుంది' అని పేర్కొన్న వైనం చూస్తే.. ముందు కొవాగ్జిన్ వేసుకున్న వారు.. బూస్టర్ డోసు కింద కొవాగ్జిన్ వేసుకుంటే మంచిదే అవుతుందన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పాలి.
Tags:    

Similar News