ఇండియన్ టెలికాం ఇండస్ర్టీ నుంచి వీలైనంత వేగం తట్టాబుట్టా సర్దుకుని బయటపడాలని.. లాభం రాకున్నా ఫరవాలేదు, నష్టం లేకుండా బయటపడితే చాలని విదేశీ టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. రిలయన్స్ జియోతో ముకేశ్ అంబానీ కొట్టిన దెబ్బ ఇండియన్ టెలికాం ఇండస్ర్టీలోని చిన్నచితకా కంపెనీలను కోలుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా చేసింది. ఒకరకంగా చెప్పాలంటే జియో చాలా సంస్థలను చావు దెబ్బకొట్టింది. ఎయిర్ టెల్ వంటి బడా కంపెనీలే ఆ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి నానా పాట్లు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే నష్టాలతో ఉన్న సంస్థలు మరింతగా నష్టాల్లో కూరుకుపోకముందే జాగ్రత్త పడుతున్నాయి. అందులో భాగంగానే నార్వేకు చెందిన ప్రముఖ టెలికాం సంస్థ టెలినార్ భారత్ లో తన వ్యాపారాన్ని భారతీ ఎయిర్ టెల్ కు విక్రయించేందుకు సిద్ధం అయిపోయింది. ఈ డీల్ లో టెలినార్ కేవలం తాను స్పెక్ట్రమ్ కొనుగోలు చేసినప్పుడు ఉన్న బకాయిలు చెల్లిస్తే చాలని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఎయిర్ టెల్ ఈ సంస్థను ఆల్మోస్టు ఫ్రీగా కొట్టేసినట్లే అనుకోవాలి.
టెలినార్ కు స్పెక్ర్టమ్ అప్పులు రూ.1600 కోట్ల వరకు ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్ టెల్ ఆ మొత్తాన్ని తీర్చబోతోందన్నమాట. భారత టెలికాం ఇండస్ట్రీలో పెరుగుతున్న పోటీయే తాము ఇండియన్ మార్కెట్ నుంచి వైదొలగడానికి కారణమని టెలినార్ వర్గాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. రిలయన్స్ జియో ఎంట్రీతో భారత్ లో తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని టెలినార్ ఆందోళన చెందినట్లుగా సంకేతాలు అందుతున్నాయి. టెలినార్ కు దేశవ్యాప్తంగా 4.4 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఏడు సర్కిళ్లలో టెలినార్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ - బీహార్ - మహారాష్ట్ర - గుజరాత్ - తూర్పు ఉత్తర్ ప్రదేశ్ - పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ - అసోం సర్కిళ్లలో టెలినార్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ఇలా విస్తరిస్తున్న దశలోనే టెలినార్ నిష్క్రమించడం పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది.
మరోవైపు ఇప్పటికే ఐడియాతో వొడాఫాన్ సెల్యూలర్ విలీనంపై చర్చలు జరుగుతున్నాయి. టెలినార్ సంస్థతో చర్చలు ముగిశాయని.. ఒక ఒప్పందం కూడా ఫైనలైజ్ అయ్యిందని.. టెలికాం రెగ్యులేటరీ నుంచి అప్రూవల్స్ రావాల్సి ఉందని ఎయిర్ టెల్ చెబుతోంది. టెలినార్ -ఎయిర్ టెల్ ఒప్పందం ప్రకారం టెలినార్ కస్టమర్లంతా ఎయిర్ టెల్ నెట్ వర్క్ కిందకు రావడంతో పాటు భారత్‌లో ఉన్న టెలినార్ ఆస్తులన్నీ ఎయిర్ టెల్ లోకి బదిలీ అవుతాయి.
ఎయిర్ టెల్ కు లాభమేంటి..?
* టెలినార్ కు ఉన్న 4.4 కోట్ల మంది కస్టమర్లలో కనీసం సగం మంది కొనసాగినా లాభమే.
* టెలినార్ కు ఉన్న 1800 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్ ను అదనంగా ఎయిర్ టెల్ కు దఖలు పడుతుంది.
* ఈ ఒప్పందం ద్వారా ఏడు సర్కిళ్లలో 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 43.4 మెగాహెట్జ్ వంటి పటిష్ఠమైన స్పెక్ట్రమ్‌తో మరింత బలోపేతం కానుంది.
* రూ.1600 కోట్లకే పోటీ సంస్థ ఒకటి పెద్ద మొత్తంలో వినియోగదారులు సహా ఎయిర్ టెల్ చేతికొచ్చేసింది.
** ఈ లెక్కన చూసుకుంటే రూ.1600 కోట్లు స్పెక్ర్టమ్ కొనుగోలు డబ్బుల అయినప్పుడు 4.4 కోట్ల మంది కస్టమర్లలో చాలామంది ఎయిర్ టెల్ కు ఫ్రీగా వచ్చినట్లే. అంటే... జియో పరోక్షంగా టెలినార్ రూపంలో ఎయిర్ టెల్ కు ఫ్రీ ఆఫర్ ఇచ్చినట్లే అనుకోవాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/