భ‌ర్త క‌న‌ప‌డ‌డం లేదంటోన్న టీడీపీ మాజీ మంత్రి

Update: 2019-10-15 05:21 GMT
చిన్న వ‌య‌స్సులోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఎన్నో సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మ‌య్యారు మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌. త‌ల్లి మృతితో అనూహ్యంగా ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి మృతితో ఆమె ఊహించ‌లేని విధంగా మంత్రి అయ్యారు. ఆ త‌ర్వాత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో త‌న సోద‌రుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి ప‌ట్టుబ‌ట్టి సీటు ఇప్పించుకుని గెలిపించుకున్నారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో అఖిల‌తో పాటు ఆమె సోద‌రుడు కూడా ఓడిపోయారు.

ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి అఖిల వ‌రుస‌గా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఇక ఆమె భ‌ర్త భార్గ‌వ్‌ రామ్‌ పై వ‌రుస‌గా కేసులు న‌మోదు అవుతుండ‌డంతో అత‌డు ప‌రారీలో ఉన్న సంగ‌తి తెలిసిందే. చివ‌ర‌కు హైద‌రాబాద్‌ లో త‌న కారుకు అడ్డు వ‌చ్చిన పోలీసుల‌ను సైతం భార్గ‌వ్‌ రామ్ ఢీకొట్టి వెళ్లిపోయాడ‌న్న టాక్ కూడా వ‌చ్చింది. ఏదేమైనా భార్గ‌వ్ కోసం పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు.

ఈ క్ర‌మంలోనే అఖిల మీడియాతో మాట్లాడుతూ తన భర్త భార్గవ్‌ రామ్ ఎక్కడ ఉన్నారో తెలియదని - తనతో టచ్‌ లో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. త‌న భ‌ర్త‌పై న‌మోదైన‌వి అన్ని త‌ప్పుడు కేసులే అని... ఆయ‌న‌కు పారిపోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. ఇక క్ర‌ష‌ర్ వివిదం సివిల్ విష‌య‌మే అని అది కూర్చొని మాట్లాడుకుంటేనే స‌రిపోయేద‌ని చెప్పారు.

క్ర‌షర్ విష‌యంలో త‌మ‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని... తాము వార్నింగ్ ఇవ్వాల‌నుకుంటే మంత్రిగా ఉన్న‌ప్పుడే ఇచ్చేవాళ్ల‌మ‌ని అఖిల చెప్పారు. ఇక త‌మ కుటుంబాన్ని టార్గెట్ చేసిన వాళ్ల‌లో వైసీపీ నేతలు కూడా ఉన్నార‌ని అఖిల చెప్ప‌డం గ‌మనార్హం. ఈ క్ర‌మంలోనే ఆమె ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ పై సైతం త‌న అక్క‌సు వెళ్ల‌క‌క్కారు. జ‌గ‌న్ చెప్ప‌కుండా తెలంగాణ‌లో కేసులు పెట్టే ప్ర‌శ‌క్తే లేద‌న్నారు.

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తాము పులివెందుల వెళ్లినందుకే ఇలా కేసులు పెడుతుండవచ్చని అఖిలప్రియ అనుమానం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News