బాబు న్యాయవ్యవస్థకే అవినీతి అంటగడతావా?

Update: 2018-09-16 11:11 GMT
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి వచ్చిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ విషయంలో రాజకీయాలు చేస్తున్న వారిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. కోర్టు నోటీసులు అందుకున్నా హాజరుకాకపోతే చప్రాసికి కూడా వారెంట్ లు జారీ చేస్తారని.. పీఎం అయినా.. సీఎం అయినా కోర్టు వాయిదాలకు హాజరు కాకపోతే వారెంట్లు సర్వసాధారమన్నారు. అలానే చంద్రబాబుకు కూడా పంపించారని భూమన తెలిపారు. దీన్ని ఏదో కుట్ర జరిగిందని పచ్చ మీడియా - నేతలు గగ్గోలు పెట్టడం సిగ్గు చేటన్నారు.

బాబ్లీ ప్రాజెక్ట్ కేసులో మహారాష్ట్ర కోర్టు నోటీసులు జారీ చేస్తే తనపై కుట్ర జరిగిందని చంద్రబాబు చెప్పుకోవడం ఎంత వరకూ సమంజసమని భూమన ప్రశ్నించారు.. ఇది ఖచ్చితంగా న్యాయ వ్యవస్థపై బురద జల్లే ప్రయత్నమని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థకే కళంకం తెస్తున్న చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని భూమన డిమాండ్ చేశారు.

చంద్రబాబుపై పెట్టింది ఓ చెత్త కేసు అని.. ఆయనది వీరోచిత పోరాటంగా.. అల్లూరి సీతారామారాజుగా ప్రచారం చేసుకుంటున్నారని భూమన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయకుడు ఓ చిటెకెల రాయుడు అని సెటైర్ వేశారు. 18 కేసుల్లో బెయిల్ తెచ్చుకున్న వీర మొనగాడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు.  కోర్టు నోటీసులు జారీ చేస్తే కేంద్రం, ప్రతి పక్షాల కుట్రగా చంద్రబాబు అభివర్ణించడం దారుణమన్నారు. దమ్ముంటే ఓటుకు నోటు కేసును ఎదుర్కోవడానికి చంద్రబాబు సిద్ధపడాలని భూమన సవాల్ విసిరారు.


Tags:    

Similar News