ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పెద్ద సాహసానికి తెర తీస్తున్నారు. ఎవరు అవునన్నా.. కాదన్నా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ నూటికి నూరుపాళ్లు సేఫ్ అయితే కాదు. అలా అని లోపాలుతో ఉందని చెప్పలేం కానీ.. పలు జాగ్రత్తల మధ్యన వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏ వ్యాక్సిన్ ను ఇంత వేగంగా రూపొందించింది లేదు. దీనికి తోడు.. వ్యాక్సిన్ వేయించుకున్న కొందరిలో చోటు చేసుకున్న ఆరోగ్య సమస్యలు కొత్త సందేహాలకు తెర తీస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. కరోనా సెకండ్ వేవ్ అమెరికాకు చుట్టేస్తుంది. తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ మీద ఉన్న సందేహాలతో అమెరికన్లు టీకాల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో ఉన్న డౌట్లను క్లియర్ చేసేలా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. దేశ ప్రజల్లో నమ్మకాన్నికలిగించేందుకు ఆయన బహిరంగంగా టీకా వేయించుకోవటానికి సిద్దమయ్యారు.
ఇప్పటికే అమెరికా రక్షణ విశాగం పెంటగాన్ చీఫ్ క్రిస్టఫర్ టీకా వేయించుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఇక.. ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ శుక్రవారం టీకా వేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్.. తాను తొలుత టీకా వేయించుకోవాలని అనుకోలేదని.. కానీ ప్రజల్లో నమ్మకం కలిగించటం కోసం.. టీకా సురక్షితమైనదన్న విషయాన్ని తెలియజేయటం కోసం టీకా వేయించుకోనున్నట్లు చెప్పారు.
78 ఏళ్ల వయసులో ఉన్న బైడెన్ కు కరోనా ముప్పు అధికంగా ఉంది. ఇలాంటివేళ.. ఆయన వ్యాక్సిన్ వేయించుకోవటానికి ముందుకు రావటం అమెరికన్లలో కొత్త నమ్మకాన్ని కలిగించే వీలుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు మరే విషయంలోనూ జరగనంత నష్టం కరోనా కారణంగా చోటు చేసుకుంది. మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు మూడు లక్షల మంది మరణించటం తెలిసిందే. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న అమెరికాలో.. ఈ వ్యాక్సిన్ కారణంగా.. కరోనా నుంచి బయటపడే వీలుందని భావిస్తున్నారు.