అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన జో బైడెన్.. తొలిరోజే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా.. ఆయన చేసిన ఓ పని కూడా చర్చకు దారిసింది. అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ఓ నటిని ఫాలో అవడమే ఈ చర్చకు కారణం. అయితే.. ఆయన ఫాలో అయ్యింది ఎక్కడో కాదు ట్విట్టర్ లో!
ట్విటర్ లో బైడెన్ ను కొన్ని మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. కానీ.. బైడెన్ మాత్రం కేవలం 11 మందినే ఫాలో అవుతున్నారు. వారిలో తన భార్య జిల్, యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ మరో 9 మంది ఉన్నారు. అయితే.. ఆ సంఖ్య ఇప్పుడు 12కు చేరింది. దీంతో.. యూఎస్ ప్రెసిడెంట్ ఫాలో అవుతున్న తొలి సెలబ్రిటీగా ఆమె రికార్డు కెక్కారు. అయితే.. ఆమె ఎవరు? బైడెన్ ఆమెను ఎందుకు ఫాలో అవుతున్నారు? అనే చర్చ మొదలైంది.
ఆమె ఎవరంటే.. మోడల్, టెలివిజన్ స్టార్, రచయిత అయిన క్రిస్సీ టైగెన్. ఆమె సోషల్ మీడియా వేదికగా కొత్త అధ్యక్షుడికి ఓ రిక్వెస్ట్ పెట్టారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్లుగా తనను బ్లాక్ చేశాడని.. కాబట్టి ‘మీరు నన్ను ఫాలో అవ్వండి ఫ్లీజ్’ అంటూ విజ్ఞప్తి చేసింది. దీంతో.. ఆమె కోరికను వెంటనే మన్నించారు బైడెన్. ఆమె రిక్వెస్ట్ పెట్టిన రోజే ఆమెను ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. దీంతో.. ఒక్కసారిగా ప్రపంచం మొత్తం తెలిసిపోయింది క్రిస్సీ టైగెన్.