అమెరికా అన్నంతనే అక్కడ శాశ్వత నివాసం కోసం ప్రయత్నించే వారు చాలామందే ఉంటారు. ప్రపంచ ప్రజల గమ్యస్థానంగా అభివర్ణించే అమెరికాలో.. గ్రీన్ కార్డు కోసం తపించేవారు లక్షల్లో ఉంటారు. అయితే.. గ్రీన్ కార్డుల జారీ కోసం బోలెడంత ప్రాసెస్ ఉండటం.. వీటిని జారీ చేసే విషయంలో ప్రభుత్వం అనుసరించే విధానాల వల్ల అసాధారణ జాప్యం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటికి చెక్ చెప్పేందుకు వీలుగా తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్య చేశారు.
గ్రీన్ కార్డుల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్య భారతీయులకు కచ్ఛితంగా శుభవార్తే అన్న మాట వినిపిస్తోంది. గ్రీన్ కార్డుల జారీ కోసం సాగుతున్న విధానంలోని అసాధారణ జాప్యాల్ని నివారించాలని తాను కోరుకుంటున్నట్లుగా జో బైడెన్ తరఫున వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. అదే జరిగితే.. హెచ్ 1బీ వీసాల మీద పని చేస్తూ.. గ్రీన్ కార్డుల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఎంతో మంది భారతీయ నిపుణులకు మేలు కలుగుతుందని చెబుతున్నారు.
అమెరికాలో గ్రీన్ కార్డు మంజూరుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 'దేశానికి ఏడు శాతం కోటా' విధానంతో భారత దేశ నిపుణులు ఎక్కువగా నష్టపోతున్నారు. తాజాగా వైట్ హౌస్ నుంచి వెలువడిన ప్రకటన కొత్త ఆశలు రేకెత్తించేలా ఉందన్న మాట వినిపిస్తోంది. తాజాగా బైడెన్ గ్రీన్ కార్డుల అంశంపై దృష్టి సారించిన వేళ.. తమ కష్టాలకు త్వరలోనే చెక్ పుడుతుందని ఆశిస్తున్నారు. భారతీయ ఐటీ నిపుణులకు ఇంతకు మించిన శుభవార్త ఇంకేం ఉంటుంది చెప్పండి.