స్కూల్ ఫీజులపై గళమెత్తిన బిగ్ బాస్ విన్నర్ !

Update: 2020-09-14 17:30 GMT
నటుడిగా ఇండస్ట్రీకి లోకి వచ్చి..మంచి నటుడిగా , బిజినెస్ మేన్ ‌గా తనదైన రీతిలో విజయం సాధించి , తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ గా కూడా నిలిచారు శివ బాలాజీ. అయితే, బిగ్ బాస్ సీజన్ 1 తర్వాత పెద్దగా కనిపించలేదు. అయితే, తాజాగా ఉన్నట్లుండి శివ బాలాజీ ఓ స్కూల్ ‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ స్కూల్ పై ఏకంగా HRC ని ఆశ్రయించాడు. మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ తీరుపై శివ బాలాజీ ఫైర్ అయ్యాడు. ఈ మేరకు ఆయన ఈ పాఠశాలపై మానవ హక్కుల కమిషన్ ‌లో కూడా ఫిర్యాదు చేసాడు.

ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ .. బలవంతంగా ఫీజు వసూలు చేస్తోందని, గవర్నమెంట్ ఆదేశాలను బేఖాతర్ చేస్తోందని ఆరోపణలు చేసారు. ఫీజు వసూలు కోసం అనవసర పరీక్షలు కూడా నిర్వహిస్తోందని, ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. పిల్లలకు ఆన్లైన్ క్లాసులు చెప్పకుండా ఐడీ బ్లాక్ చేస్తుందని, ఎదురు తిరిగి అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు. మీరు పిల్లలకు క్లాసులు తీసుకోవడం కాదు, నేను మీకు క్లాసులు తీసుకుంటా.. అంటూ శివబాలాజీ ఘాటుగా హెచ్చరించారు. ఈయన చేసిన కామెంట్స్‌ తో ఒక్కసారిగా ఆ స్కూల్ పేరు హాట్ టాపిక్ అయిపోయింది .
Tags:    

Similar News