దేవాన్ష్ పుట్టినరోజున టీటీడీకి భారీ విరాళం

Update: 2021-03-21 16:30 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా శనివారం తిరుమలకు చేరుకున్నారు.మార్చి 21న తన మనవడు, నారాలోకేష్-బ్రహ్మాణీల కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు కావడంతో తిరుమల శ్రీవారిని టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మనవడు దేవాన్ష్ కు కి ఆశీర్వచనాలు అందించారు.

అనంతరం తిరుమల శ్రీవారి అన్నదానం ట్రస్ట్ కు రూ.30 లక్షలు విరాళంగా అందజేశారు. దేవాన్ష్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దేవాన్ష్ పుట్టినరోజును నాలుగేళ్లుగా తిరుమల శ్రీవారి సన్నిధిలో నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది.

చంద్రబాబు కుటుంబంతోపాటు సినీ నటుడు బాలక్రిష్ణ, ఆయన సతీమణి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దేవాన్ష్ పుట్టినరోజున ఒకరోజు అన్న ప్రసాదం వితరణకు అయ్యే ఖర్చులను చంద్రబాబు కుటుంబం భరిస్తోంది. లోకేష్ తన కుమారుడికి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు తిరుమల పర్యటన సందర్భంగా తిరుపతి టీడీపీ లోక్ సభ అభ్యర్థిగా పనబాక లక్ష్మి తరుఫున ప్రచారాన్ని కూడా చంద్రబాబు ప్రారంభించనున్నారు.
Tags:    

Similar News