మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చంద్రబాబు ప్రచార పర్వానికి బ్రేకులేసింది. సెల్ఫు డబ్బా కొట్టుకునేందుకు జనచైతన్య యాత్రల పేరుతో టీడీపీ నిర్వహిస్తున్న యాత్రల నిర్వహణకు నిధుల కొరత ఏర్పడింది. పాత నోట్లతో పని కాకపోవడం.. కొత్త నోట్ల కొరత ఉండడంతో యాత్రలు కళ తప్పాయి.
గత రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మెప్పు పొందాలనే చంద్రబాబు ఆశయాలు పూర్తిగా నెరవేరేలా లేవు. గడిచిన 24 రోజులుగా జనచైతన్య యాత్రలు సాగుతున్నప్పటికీ ఈ నెల 8వ తేదీ నుంచి మందకొడిగా మారాయి. పెద్దనోట్ల రద్దు ప్రభావంతో యాత్రలకు విరాళాలు రావడం లేదు. దీంతోపాటు నాయకులు తమ దగ్గర ఉన్న పాత కరెన్సీ మార్చుకునే పనిలోనే బిజీగా ఉండడం, కొత్తనోట్లు అందుబాటులోకి రాకపోవడంతో పార్టీ కార్యకలాపాలు పూర్తిగా మందగించాయి.
జనచైతన్య యాత్రలకు ప్రజలు తరలింపు కూడా కష్టమైపోయింది. జనం ఎవరికి వారు డబ్బు కోసం బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతుండడం.. అలాగే యాత్రల్లో పాల్గొన్నందుకు వారికి కూలి ఇవ్వడానికి కూడా పాత నోట్లు పనికిరాకపోవడంతో జనం రావడం లేదు. ఆరంభంలో ప్రతి ప్రాంతంలో జరిగే జనచైతన్య యాత్రలు భారీ బహిరంగ సభలు, పెద్దఎత్తున ఊరేగింపులు, కిలోమీటర్ల పొడవునా పాదయాత్రలు సాగేవి. నాయకులు పాదయాత్రలు చేసినంత పొడవునా పూలు జల్లుతూ మైకుల హోరులో నినాదాలు చేస్తూ అధినేత చంద్రబాబును కీర్తిస్తూ యాత్రలు కొనసాగించేవారు. కానీ నోట్ల రద్దుతో సీన్ రివర్స్ అయ్యింది. జనచైతన్య యాత్రలు మొక్కుబడిగా మారిపోయాయి. పార్టీ కేడరే సరిగా పాల్గొనడం లేదు. దీంతో చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ రగిలిపోతున్నట్లు సమాచారం.