ఏపీలో రాజకీయం ఎటువైపు వెళ్తుందో ఎవరికీ అర్థం కావడంలేదు. ఏపీ లో జగన్ ప్రభుత్వం కొలువుదీరి మరికొన్ని రోజుల్లోనే ఏడాది పూర్తి కాబోతుంది. ఈ సంవత్సర కాలంలో ఏపీలో చాలా జరిగాయి. గత ప్రభుత్వం చాలా తప్పులు చేసింది అని ..జగన్ ప్రభుత్వం తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తుంటే మరోవైపు టీడీపీ మాత్రం వైసీపీ వల్లే ఏపీ అభివృద్ధి లో వెనక్కి పోతుంది అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు అంటూ సరికొత్త వాదన తెరపైకి తీసుకురావడం తో ..రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఆ తరువాత రోజుకొక విషయం ఏపీలో హాట్ టాపిక్ గా మారుతుంది.
ఇక తాజాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలని వాయిదా వేయడం కూడా ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది. సీఎం కి కూడా తెలియకుండా ఎన్నికలని వాయిదా వేయడం ఏంటి అని సీఎం జగన్ ఈసీ పై మండిపడ్డారు. ఇకపోతే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ..జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. అయితే , దీన్ని వైసీపీ ప్రభుత్వం మాత్రం తిప్పికొడుతూ వస్తుంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ అనే కంపెనీ 26 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిది. ఆయితే.. కొద్ది రోజుల క్రితం ఆ ఎంవోయూ విషయంలో ఆసక్తిగా లేదని పేపర్ పరిశ్రమలో ప్రచారం జరిగింది. అయితే ,ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ (ఏపీపీ) మిల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లడం లేదు అని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్వయంగా తెలిపారు.
ఇక దీనికోసం రామాయపట్నం ఓడరేవు సమీపంలో 2 ,471 ఎకరాలని సేకరించి ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ కంపెనీకి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కంపెనీ వల్ల ప్రత్యక్షంగా 4 వేలమందికి , పరోక్షంగా లక్షమందికి వస్తుంది అని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ , ఇటీవలే ఏపీలో కంపెనీ ఏర్పాటు చేయాలని, ఆ కంపెనీ కి పరిశ్రమలశాఖ ఆహ్వానం పంపినప్పటికీ ఆ కంపెనీ యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేదు. దీనితో దరిదాపుగా ఈ కంపెనీ కూడా ఏపీ నుండి వెనక్కి వెళ్ళినట్టే.