మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ రాణాకు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమె కులం సర్టిఫికెట్ ను రద్దు చేయడంతోపాటు రూ.2లక్షల రూపాయల జరిమానా విధించింది.
నవనీత్ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారు కాదని.. నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ తో ఆమె పోటీచేసి గెలుపొందారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అదసూల్ దాఖలు చేసిన పిటీషన్ పై బాంబే హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. విదర్భ ప్రాంతంలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన నవనీత్ కౌర్.. తొలిసారి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే.
బాంబే హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఆమె లోక్ సభ సభ్యత్వం ప్రమాదంలో పడినట్టైంది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది. తన కులం గురించి వాస్తవాలు సేకరించేందుకు రెడీ అయ్యారు.
2019 ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి ఎస్సీ రిజర్వ్ లోక్ సభ స్థానం నుంచి నవనీత్ కౌర్ శివసేన అభ్యర్థి ఆనందరావు అదసూల్ పైన విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన నవనీత్ కౌర్.. ఎన్సీపీ తరుఫున ఎన్నికల బరిలోకి దిగి నాడు ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టికెట్ దక్కక ఒంటిగా పోటీచేసి గెలుపొందారు.
తెలుగు చిత్రాలతోపాటు కన్నడ, తమిళం, పంజాబీ చిత్రాల్లో నవనీత్ కౌర్ నటించారు. ఆ తర్వాత మహారాష్ట్ర రాజకీయ నేతను పెళ్లాడి సెటిల్ అయ్యారు.