ఔరా: గుడిలో బికినీ ఫొటోషూట్

Update: 2017-01-13 09:30 GMT
ఒకడేమో చెప్పుల మీద మన దేవుళ్ల బొమ్మలు ప్రింట్ చేస్తాడు. ఇంకొకరుడు దేవుడి చేత సిగరెట్ పట్టిస్తాడు. మరొకడు దేవుడి ముందు బీరు సీసాలు పెట్టి సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తాడు. హిందూ దేవుళ్ల విషయంలో కొందరి ఆటలు అన్నీ ఇన్నీ కావు. అయినా హిందువులు ఉదార స్వభావులు కాబట్టి చెల్లిపోతూ ఉంటుంది. మరో మతానికి సంబంధించిన దేవుడి విషయంలో వివాదాస్పదంగా ఏం జరిగినా రణరంగమే అవుతుంది. కానీ హిందూ దేవుళ్ల విషయంలో మాత్రం భక్తుల మనోభావాల్ని దెబ్బ తీసేలా విశృంఖలంగా వ్యవహరించినా చెల్లిపోతూ ఉంటుంది.

తాజాగా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ దగ్గర ఓ ప్రసిద్ధ ఆలయంలో జరిగిన తంతు చూస్తే హిందూ వాదులందరికీ ఒళ్లు మండటం ఖాయం. ఆలయం లోపల ఒక విదేశీ మోడల్ తో బికినీ వేయించి.. ఆమె ఫోటో షూట్ చెయ్యడానికి సిద్ధపడటం గమనార్హం. వాళ్ల కాన్సెప్ట్ ఏంటో.. వాళ్లకు ఎవరు పర్మిషన్ ఇచ్చారో కానీ.. బికినీ ధరించిన ఓ విదేశీ మోడల్ తో పాటు ఒక యూనిట్ ఆ ఆలయం లోపలికి ప్రవేశించింది. ఆ మోడల్ చుట్టూ కొందరమ్మాయిలు చీరలు ధరించి నిలబడి ఉన్నారు. ఇక అంతా ఓకే అనుకోగానే ఫొటో షూట్ మొదలైంది. ఇంతలో ఈ విషయంలో స్థానికులకు తెలిసి పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చారు. ఈ తతంగంపై తీవ్రంగా మండిపడ్డారు. నిర్వాహకుల్ని నిలదీశారు. ఆలయం పవిత్రతను మంటకలిపారని విరుచుకుపడ్డారు. తర్వాత ఆలయ నిర్వాహకుల మీద.. ఈ ఫొటో షూట్ చేసిన వాళ్ల మీదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News