ఆస్తుల విష‌యంలో బిల్‌ గేట్స్ షాకింగ్ రికార్డ్

Update: 2017-01-25 11:07 GMT
టెక్నాల‌జీ దిగ్గ‌జం -మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ ట్రిలియ‌నీర్ కాబోతున్నారు. వ‌చ్చే 25 ఏళ్ల‌ల్లో ఆయ‌న ప్ర‌పంచంలోనే మొట్ట మొద‌టి ట్రిలియ‌నీర్ కానున్నారు. బ్రిట‌న్‌కు చెందిన ఆక్స్‌ ఫామ్ ఇంట‌ర్నెష‌న‌ల్ సంస్థ త‌న ప‌రిశోధ‌నా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. బిల్ గేట్స్ ట్రిలియ‌నీర్‌ గా మారే స‌మాయానికి ఆయ‌న వ‌య‌సు 86 ఏళ్లు ఉంటాయ‌ని అంచ‌నా వేశారు. బిల్ గేట్స్ ఆస్తులు 2009 నుంచి ప్ర‌తి ఏడాది సుమారు 11 శాతంతో వృద్ధి చెందుతున్నాయి.

క‌నీసం వంద కోట్ల డాల‌ర్లు ఉంటే బిలియ‌నీర్ అంటారు. సాధార‌ణంగా మ‌నం కోటీశ్వ‌రుడు అని లేదా అప‌ర కుబేరుడు అని పిలుస్తాం. ట్రిలియ‌నీర్ అంటే ల‌క్ష కోట్ల డాల‌ర్ల కంటే ఎక్కువే ఉన్న‌ట్టు. ఇది ఇండియ‌న్ క‌రెన్సీతో పోలిస్తే ఆ మొత్తం విలువ రూ.68 ల‌క్ష‌ల కోట్లుగా అంచ‌నా వేయ‌వ‌చ్చు.

ప్ర‌స్తుతం బిల్ గేట్స్ ద‌గ్గ‌ర 84.6 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద ఉంది. అంటే అది ఇండియ‌న్ క‌రెన్సీలో 5 ల‌క్ష‌ల 76 వేల కోట్లు. ఇది 25 ఏళ్ల‌ల్లో 68 ల‌క్షల కోట్లు అయితే అప్పుడు అత‌ను ట్రిలియ‌నీర్‌ గా మారే అవ‌కాశం ఉంది. 2006లో బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్‌ ను వ‌దిలిన‌ప్పుడు ఆయ‌న ఆస్తులు 50 బిలియ‌న్ల (5 వేల కోట్ల) డాల‌ర్లు. 2016లో ఆయ‌న సంప‌ద 75 బిలియ‌న్ల డాల‌ర్లకు చేరింది. ఛారిటీ సంస్థ ద్వారా విరాళాలు ఇస్తున్నా - బిల్ గేట్స్ ఆస్తులు మాత్రం శ‌ర‌వేగంగా రెట్టింపు అవుతున్నాయి. ఎనిమిది మంది కుబేరుల ద‌గ్గ‌రే ప్ర‌పంచంలో స‌గం ధ‌నం ఉన్న‌ట్లు ఇటీవ‌లే ఫోర్బ్స్ అంచ‌నా వేసిన విష‌యం తెలిసిందే. ఎనిమిది మంది బిలియ‌నీర్ల‌లో వారెన్ బ‌ఫెట్‌ - బిల్ గేట్స్‌ - అమెన్సియా ఒర్టిగో - కార్లోస్ స్లిమ్‌ - జెఫ్ బెజోస్‌ - మార్క్ జుక‌ర్‌ బ‌ర్గ్‌ - మైఖేల్ బ్లూమ్‌ బ‌ర్గ్‌ - లారీ ఎలిస‌న్ ఉన్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News