త్వరలో మరిన్ని వైరస్​ లు..10 లక్షలమంది చనిపోతారు..బిల్ ​గేట్స్​ సంచలన వ్యాఖ్యలు..!

Update: 2021-02-07 00:30 GMT
మైక్రోసాఫ్ట్​ అధినేత బిల్​గేట్స్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2015లో బిల్​గేట్స్​ ఓసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మానవులు తయారుచేసిన ఓ వైరస్​ ప్రపంచాన్ని గడగడ లాడించబోతున్నదని.. లక్షలమంది ప్రాణాలు కోల్పోతారని ఆయన పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో 2020లో కరోనా టైంలో మరోసారి వైరల్​ అయ్యాయి. బిల్​గేట్స్​ చెప్పినట్టుగానే కరోనా వైరస్​ మానవ నిర్మితం కావొచ్చని చాలా మంది అభిప్రాయపడ్డారు. అంతేకాక చైనాలోని వూహాన్​ సిటీలో ఉన్న వైరాలజీ ల్యాబ్​లో ఈ వైరస్​ పుట్టిందన్న ఆరోపణలు వచ్చాయి.

ప్రస్తుతం డబ్ల్యూహెచ్​వో ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నది అది వేరే విషయం. ఇదిలా ఉంటే బిల్​గేట్స్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని వైరస్​లు ప్రజలను బలిగొనబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. లక్షలమంది ప్రాణాలు కోల్పోతారని పేర్కొన్నారు. కరోనాతో ముప్పు అంతరించి పోలేదని ఆయన హెచ్చరించారు. ఇటువంటి ముప్పులు మరిన్ని పొంచిఉన్నాయని చెప్పారు.

‘వచ్చే దశాబ్ద కాలంలో దాదాపు 10 మిలియన్ల మంది వైరస్​తో చనిపోతారు. యుద్ధాలు జరిగి మిస్సైల్స్‌, మైక్రోబ్స్‌ కాదు జనాలు చనిపోరు. వైరస్​తో ప్రాణాలు కోల్పోతారు. ఇకమీదట జరిగేవి అన్ని బయోవార్​లే.’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. డెరేక్‌ ముల్లర్‌ అనే వ్యక్తి నడుపుతోన్న యూట్యూబ్‌ చానెల్‌ వెరిటాసియంలో బిల్‌ గేట్స్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎబోలా వైరస్‌ వ్యాప్తి సమయంలో గేట్స్‌ సమీప భవిష్యత్తులో ఇంతకంటే ప్రమాదకరమైన వైరస్‌లు మన మీద దాడి చేస్తాయని.. వాటి నుంచి రక్షణ పొందటానికి మన దగ్గర ఎలాంటి ఆయుధం ఉండదని తెలిపారు. ఆయన మాటల ప్రకారం 2020లో వెలుగు చూసిన కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా 2.271 మిలియన్ల మందిని బలి తీసుకోగా.. 104.3 మిలియన్ల మంది వైరస్‌ బారిన పడ్డారు.
Tags:    

Similar News