ఇంటర్నెట్ అంటే ఏంటి? 1995లో బిల్ గేట్స్ నే పిచ్చోడనుకున్నారు.. వైరల్ వీడియో?

Update: 2022-08-31 05:21 GMT
ఈ ప్రపంచాన్ని మార్చింది ఏదైనా ఉందటే అది ఖచ్చితంగా ఇంటర్నెట్ యే.. ఇప్పుడు ఇంట్లో ఉండే అన్ని పనులు చక్కదిద్దుతున్నామంటే అదంతా ఇంటర్నెట్ మహిమనే. మారుమూల గ్రామంలో ఉండి గ్రామస్థులు కూడా దీన్ని వినియోగిస్తున్నారంటే అదంతా దీని ఎఫెక్ట్ యే.. ఇంతలా ప్రపంచాన్ని మార్చేసిన ఇంటర్నెట్ ను అమెరికాలో వినియోగంలోకి తెచ్చింది మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. అయితే ఆయన తొలుత ప్రవేశపెట్టినప్పుడు ఇదేంటో తెలియక ఆయనను పిచ్చోడిలా చూశారు. ఇంటర్వ్యూలో ఎద్దేవా చేసేలా ప్రశ్నలు వేశారు. దానికి బిల్ గేట్స్ ఎంతగా అర్థమయ్యేలా చెప్పినా యాంకర్ కు, జనాలకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఈ ఇంటర్నెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.  నాడు బిల్ గేట్స్ తో ఓ అమెరికన్ టీవీ చానెల్ ఇంటర్వ్యూ చేసింది. నాడు యాంకర్ ఇంటర్నెట్ పై వింత ప్రశ్నలుఅడగడం..దానికి బిల్ గేట్స్ సమాధానం ఇవ్వడం ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నాడు ఇది ప్రపంచాన్ని మార్చేస్తుందని తెలియక యాంకర్ వేసిన సెటైర్లు ఇప్పుడు నవ్వులు పూయిస్తున్నాయి..

ఇంటర్నెట్ ను కంప్యూటర్ ద్వారా ప్రవేశపెట్టిన  బిల్ గేట్స్ 1995లో 'లేట్ షో విత్ డేవిడ్ లెటర్‌మాన్‌'తో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మరియు ప్రేక్షకులకు ఇంటర్నెట్ అంటే ఏమిటో వివరించడానికి ప్రయత్నించాడు. ఇంటర్నెట్ ఇంకా నాడు తొలి దశలో లాంచింగ్ లోనే ఉంది.ఈ రోజు సాధించగలిగిన వాటిలో చాలా వరకు నాడు అస్సలు ఊహించలేదు.

అయినప్పటికీ ఒకానొక సమయంలో ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్  లెటర్‌మాన్ దీనిపై ఆందోళన చెందాడు. "ఏమి జరుగుతుందో కానీ ఇంటర్నెట్ అయితే క్రూరంగా ఉంది." అని గేట్స్‌ను  ఇంటర్నెట్ అంటే ఏమిటి అని ప్రశ్నించాడు.  మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు ఇలా సమాధానమిచ్చాడు "ప్రజలు సమాచారాన్ని బదిలీ చేసుకునేందుకు ఇదొక సులువైన మార్గం. వారు వారి స్వంతం చేసుకోవచ్చు. ఇంటి అవసరాలు, కంపెనీల అవసరాలు పనులు వేగంగా అవుతాయి. తాజా సమాచారం ఇ-మెయిల్ ద్వారా పంపి త్వరగా పనులు పూర్తి చేసుకోవచ్చు." అని వివరించాడు.

యాంర్ లెటర్‌మ్యాన్ ఇంటర్నెట్ ఆవశ్యకతను పూర్తిగా విశ్వసించలేదు. మీ కంప్యూటర్‌లో బేస్‌బాల్ మ్యాచ్ వినడం గురించి చర్చిస్తూ మరో ప్రశ్న అడిగారు. “ఇందులో  రేడియో బెల్ మోగుతుందా?” అని ప్రశ్నించాడు. దీనికి గేట్స్ మీకు కావలసినప్పుడు మ్యాచ్‌ని వినడానికి “చిన్న తేడా” గురించి వివరించాడు.  లెటర్‌మాన్ దీనికి ఇదొక  టేప్ రికార్డర్లు గంట మోగుతున్నాయన్నట్టు అని కంప్యూటర్ ను తీసిపారేసేలా ఎద్దేవా చేశారు.

ఎపిసోడ్ సమయంలో గేట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఆగమనాన్ని, కంప్యూటర్లు వాటికవే "ఆలోచించటానికి" ఎలా వస్తాయో కూడా ముందే ఊహించి చెప్పారు. ఇప్పుడదే నిజమైంది. కానీ నాటి యాంకర్ మాత్రం తెలివైన కంప్యూటర్ ఆలోచనను "చాలా భయానక ఆలోచన" అని భయపెట్టాడు.  ఈ రోజు వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాగ్దానాలు, ప్రమాదాలు రెండింటినీ కలిగి ఉందని నిర్ధారిస్తుంది.  ఎలా అమలు చేయాలనే దానిపై గేట్స్ అప్పుడే ముందుగా ఊహించి చెప్పారు.  “ఇది చాలా కఠినమైన సమస్యగా మారుతుంది. వాస్తవానికి దానిపై దాదాపు ఎటువంటి పురోగతి లేదు, కాబట్టి అది ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇది ఎప్పటికీ జరగదని కొందరు అనుకుంటారు." అంటూ ఊహించారు.

లెటర్‌మ్యాన్‌ నాడు సంధించిన ప్రశ్నలు.. నేడు నిజమైన వాస్తవాన్ని గుర్తించి చాలా మంది ఈ వీడియోను షేర్ చేసి నాటి ఇంటర్నెట్‌ తొలి అడుగులో  ఏం జరిగిందన్నది గుర్తు చేసుకుంటున్నారు.  ఇంటర్నెట్ వీడియో  ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. బిల్ గేట్స్ మరియు లెటర్‌మాన్ ఇద్దరి జీవితకాలంలో ఎంత మార్పులు ఇంటర్నెట్ తీసుకొచ్చిందన్నది చాలా మంది కామెంట్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Tags:    

Similar News