చైనాతో యుద్ధ అవకాశాలను తోసిపుచ్చలేం: బిపిన్ రావత్

Update: 2020-11-05 00:06 GMT
చైనాతో సరిహద్దుల్లో ఇప్పటికీ సంఘర్షణ వాతావరణమే ఉందని.. చైనాతో యుద్ధానికి గల అవకాశాలను తోసిపుచ్చలేమని భారత భద్రతా దళాల అధిపతి బిపిన్‌ రావత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు లఢక్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని ఆయన అన్నారు.

'భారత్‌ సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఒక పెద్ద సంఘర్షణ వాతావరణాన్ని క్రియేట్‌ చేసిందని బిపిన్ రావత్ అన్నారు.. దీనిని తేలికగా తీసుకోం అన్నారు. చైనాతో, భారత్‌ ఎనిమిదో సారి చర్చలు జరపనుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మొత్తం భద్రతా చర్యలో భాగంగా సరిహద్దు ఘర్షణలు, కవ్వింపు చర్యలను చైనా ప్రేరేపించిందన్నారు. దీంతో చైనాతో యుద్ధం రాదని అనుకోవద్దని అయన తెలిపారు.

ఇక దాయాది దేశం మన భూభాగంలోకి ఎల్‌వోసి వెంబడి ఉగ్రవాదులను పంపించాలంటే భయపడుతుందన్నారు. ఉగ్రవాదాన్ని సరిహద్దులు దాటించేందుకు పాక్ జరిపే యత్నాలను కూడా భారత ఆర్మీ బలగాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయని చెప్పారు. భారత వ్యతిరేక శక్తులతో కలిసి జమ్మూకశ్మీర్‌పై పాకిస్థాన్‌ అప్రతిహతంగా పరోక్ష యుద్ధానికి పాల్పడుతోందని, దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంతగా క్షీణించాయని అన్నారు.

సరిహద్దు వివాదంపై చైనాతో అనేక విడతలుగా చర్చలు జరిపినా ఇంతవరకూ ఎలాంటి ఫలితం రాలేదని రావత్ స్పష్టం చేశారు. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఐఎస్ఐ) జమ్మూకాశ్మీర్ లో పరోక్ష యుద్ధాన్ని కొనసాగిస్తోందని.. మత సామరస్యాన్ని దెబ్బ తీసేందుకు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తోందన్నారు.
Tags:    

Similar News