పంజాబీ సింగ్ సిద్దూ మూసేవాలా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇది ముమ్మాటికీ పక్కా ప్లాన్ ప్రకారం చేసిన ప్రతీకార హత్య అని దర్యాప్తులో తేలింది. అదీగాక అనుమానితుడు గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ కూడా తన అన్నని మట్టుబెట్టినందుకు ప్రతీకారంగానే సిద్దూను తన ముఠాసభ్యులు చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో మూసేవాలా హత్యకు సూత్రధారిగా గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ అని ఢిల్లీ పోలీసులు తేల్చారు.ఇప్పటికే బిష్ణోయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతవారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు.ఇక బిష్ణోయ్ తనతోపాటు గన్ ఫైరింగ్ లో పాల్గొన్న వారి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించాడు. ఈ కేసులో ఇప్పటివరకూ 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ తరుణంలో సిద్దు హత్య జరిగిన రోజు అసలేం జరిగిందని పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ సీసీ టీవీ ఫుటేజ్ లో సిద్దూ ఎస్.యూవీ కారుకు సమీపంలో ఇద్దరు వ్యక్తులు నిలుచొని ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి సెల్ఫీ కోసం సిద్ధూ వచ్చినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ వ్యక్తి డ్రైవర్ వైపుగా వచ్చి సిద్దూతో సెల్ఫీ తీసుకున్నారు.
ఆ వ్యక్తి సెల్ఫీ తీసుకున్న తర్వాతనే సిద్ధూపై కాల్పులు జరిగాయి. ఆ సమయంలోనే 'దాడి చేయడానికి సిద్ధం కండి' అంటూ షూటర్లకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. కానీ ఆ సీసీ ఫుటేజ్ లో ఆ వ్యక్తుల ముఖాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి.పోలీసులు ఆ వీడియోలో కనిపించిన ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా పరిగణిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఈ సెల్ఫీనే కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఇక సిద్దూను హతమార్చిన ఎనిమిది మంది షూటర్లను పంజాబ్ పోలీసులు గుర్తించారు. ఆ షూటర్లంతా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్రలకు చెందిన వారుగా చెబుతున్నారు. నిందితుల ఆచూకీ కోసం ఈ మూడు రాష్ట్రాల్లోనూ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ప్రముఖ ర్యాప్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలాను పట్టపగలు నడిరోడ్డుపై పంజాబ్ లోని బర్నాలా జిల్లాలో కాల్చిచంపడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన బంధువు ఇంటికి సిద్దూ థార్ ఎస్.యూవీ కారులో బయలుదేరాడు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే ఆయన ప్రయాణించాడు. సెక్యూరిటీని వెంట తీసుకెళదామనుకున్నా బంధువు ఇల్లు సమీపంలోనే ఉండడం.. అలాగే థార్ జీపులో ఐదుగురు కూర్చోవడం సాధ్యంకాదు కాబట్టే ఆయన సెక్యూరిటీని తీసుకెళ్లాలన్న ప్రతిపాదన పక్కనపెట్టి వెళ్లారు. 10 మంది వరకూ 30 రౌండ్లు కాల్పులు జరిపి హతమార్చారు. సిద్దూ పక్కనే ఉన్న గుర్విందర్ సింగ్, గుర్ ప్రీత్ సింగ్ కూడా గాయపడ్డారు.
పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వీఐపీలకు భద్రతను ఉపసంహరించిన మరుసటి రోజే మే 29న సిద్దూను దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపడం కలకలం రేపింది. హత్య తమ పనే అని బిష్ణోయ్ అనుచరుడు గోల్డీ బ్రార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సిద్ధూ హత్య పంజాబ్ లోనే కాదు.. దేశం మొత్తాన్ని కుదిపేసింది. పంజాబ్ లోని మాన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు రావడంతో పంజాబ్ ప్రభుత్వం వీఐపీలకు భద్రతను తిరిగి పునరుద్దరించింది.