ఓటమిని అంగీకరించిన బీజేపీ.. పరాజయంతో నిరాశ చెందొద్దని పిలుపు

Update: 2020-02-11 05:32 GMT
దేశ వ్యాప్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైనే చర్చ సాగుతోంది. దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో తాము ఉండాలని భావించిన బీజేపీకి పరాభవం ఎదురైంది. మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా విజయం ఆమ్ ఆద్మీ పార్టీగా మొదటి నుంచి తెలుస్తోంది. అయితే ఈ ఫలితాలు ఉత్కంఠగా మారాయి. అయితే ఈ ఫలితాలు ఎలా ఉంటాయనేది ముందే బీజేపీ ఊహించింది. ముందే ఓటమిని అంగీకరించినట్లు పార్టీ కార్యాలయంలోని పోస్టర్లు చూస్తే అర్థమవుతోంది.

ఎన్నికల తుది ఫలితాలు రావడానికి కొద్ది గంటల ముందు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఒక పోస్టర్ వైరలైంది. ఈ పోస్టర్‌ను చూస్తే ఎన్నికల ఫలితాలకు ముందే బీజేపీ తన ఓటమిని అంగీకరించనట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్‌ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫొటోతో పాటు ఓ సందేశం ఉంది.

‘విజయంతో మనం అహంకారులు గా మారకూడదు. పరాజయం తో మనం నిరాశకు గురి కాకూడదు’ అని కార్యకర్తలను ఉద్దేశించి ఉంది. అంటే ఎన్నికల ఫలితాల్లో తాము ఓడిపోతామని పక్కాగా తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి అధికారం దక్కక పోవడంతో నిరాశె కు గురి కావొద్దని, అదే విధంగా విజయంతో అహంకారులుగా మారవద్దని గెలిచిన వారికి హితవు పలుకుతూ ఈ పోస్టర్ ఉంది.

అయితే ఈ పోస్టర్ పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. సీఏఏ, ఎన్నార్సీకి బీజేపీ మూల్యం చెల్లించుకుందని, ఇకనైనా సక్రమంగా పాలించాలని సోషల్ మీడియాలో కోరుతున్నారు. ఈ ఎన్నికలను బీజేపీ పాలనకు రెఫరెండంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. మరీ దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.



Tags:    

Similar News