2014లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి కేంద్రంలో బీజేపీ అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మూడున్నరేళ్ల కాలంలో అనేక అంశాలతో మోదీ ప్రతిష్ట మసకబారిందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. పటేళ్ల ఉద్యమం - బీఫ్ బ్యాన్ - దళితులపై దాడులు - పెద్ద నోట్ల రద్దు - జీఎస్టీ వంటి అంశాలతో సామాన్యులు వచ్చే ఎన్నికల్లో మోదీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా లేరని ఆ కథనాల సారాంశం. ఈ నేపథ్యంలో డిసెంబరు 9 - 14 వ తేదీల్లోజరగబోతున్న గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం పై పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. సొంత ఇలాకాలో మోదీ హవా కొనసాగుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ అండ్ కోకు ఊరటనిచ్చే వార్త ఒకటి వెలువడింది. హిమాచల్ ప్రదేశ్ - గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కమలనాథులు విజయం సాధిస్తారని తాజా ఓపీనియన్ పోల్ లో వెల్లడైంది. ఆ రెండు రాష్ట్రాలు బీజేపీ ఖాతాలోకి వెళతాయని.. ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఒపీనియన్ పోల్ సర్వే ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ - గుజరాత్ ఎన్నికల్లో సాధారణ మెజారిటీకన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని సర్వే లో తేలడం విశేషం.
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు రాబోయే ఎన్నికల్లో చుక్కెదురవబోతున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. అక్కడ ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీజేపీ రాబోయే ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించే అవకాశముందని తేలింది. సర్వే అంచనాల ప్రకారం హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న 68 స్థానాలకు గాను బీజేపీ 43 నుంచి 47 సీట్లు గెలిచే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ 21- నుంచి 25 సీట్లు సాధించవచ్చని తేలింది. గుజరాత్ లోని 182 స్థానాలకు గానూ బీజేపీకి 115 నుంచి 125 సీట్లు లభించే అవకాశాలున్నాయి. అయితే, గతంతో పోలిస్తే గుజరాత్ లో కాంగ్రెస్ అధికంగా సీట్లు సాధించబోతోందట. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 57 నుంచి 65 సీట్లు వచ్చే అవకాశం ఉందట. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి 48 శాతం ఓట్లు - కాంగ్రెస్ కు 38 శాతం ఓట్లు పోల్ అవ్వవచ్చని తెలుస్తోంది.
ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కి 34 శాతం మంది గుజరాతీలు మొగ్గు చూపుతున్నారట. ప్రధాని మోదీ పై కూడా గుజరాత్ ప్రజలు నమ్మకాన్ని ఉంచారు. ఆయన గుజరాత్ కు అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తున్నారని 66 శాతం మంది ప్రజలు నమ్ముతున్నారు.
మోదీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు బాగా లేవని ఎక్కువ మంది గుజరాతీలు అభిప్రాయపడ్డారు. ప్రధాని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానం పట్ల 51 శాతం మంది గుజరాతీలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో 53 శాతం మంది ప్రజలు పెద్ద నోట్ల రద్దుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ లలో బీజేపీ విజయం సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా, అనేక అంశాలతో సతమతమవుతున్న బీజేపీకి ఈ సర్వే పోల్ భారీ ఊరటనిచ్చిందని చెప్పవచ్చు.