కేసీఆర్ మీద ఈసీకి కంప్ల‌యింట్ !

Update: 2018-12-07 11:16 GMT
టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మీద బీజేపీ - కాంగ్రెస్ నేత‌లు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ కు కంప్ల‌యింట్ చేశారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం పోలింగ్ బూత్ వ‌ద్ద ఏ పార్టీ వారు ఎలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వ‌కూడ‌దు. కానీ కేసీఆర్ ఓటేసి వ‌చ్చిన అనంత‌రం త‌మ పార్టీ భారీ మెజారిటీతో గెల‌వ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనిని ఇత‌ర పార్టీలు సీరియ‌స్‌ గా ప‌రిగ‌ణించాయి.

కేసీఆర్ ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్కారు - ఆయ‌న‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకోమంటూ ఇరు పార్టీలు అత‌నిపై ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదు స్వీక‌రించిన ఈసీ ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై స్పందించ‌లేదు. ఈసీ క‌మిష‌న‌ర్ ర‌జ‌త్‌ కుమార్ ఎటువంటి ప్ర‌క‌ట‌నా విడుద‌ల చేయ‌లేదు.

అయితే, కేసీఆర్ అక్క‌డికి వ‌చ్చిన వెంట‌నే మీడియా చుట్టు ముట్టి ఆయ‌న‌ను ప్ర‌శ్నించింది. దీంతో ఆయ‌న స్పందించాల్సి వ‌చ్చిందని... అంత‌కుమించి ఏం లేద‌ని టీఆర్ ఎస్ నేత‌లు అంటున్నారు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే మొన్న‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని ఉత్సాహం ఏదో టీఆర్ ఎస్ వాళ్ల‌లో ఈరోజు చాలా స్ప‌ష్టంగా క‌నిపించింది. ఆ నేతలంద‌రూ చాలా కాన్ఫిడెంట్‌ గా ఉన్నారు. మ‌రి ప్ర‌జ‌ల తీర్పు ఎవ‌రి వైపు ఉందో మ‌రి!
   

Tags:    

Similar News