బీజేపీ రాజ‌కీయాలు.. `భాగ్య‌ల‌క్ష్మి` నుంచే స్టార్ట్‌!

Update: 2021-08-16 00:30 GMT
రాజ‌కీయాల్లో నేత‌ల‌కు సెంటిమెంటు పాళ్లు ఎక్కువ‌గానే ఉంటున్నాయి. ముహూర్తాలు చూసుకునినామినేష‌న్లు వేయ‌డం.. శ‌కునాలు చూసుకుని పాద‌యాత్ర‌లు ప్రారంభించ‌డం.. మంగ‌ళ‌హార‌తులు.. కుంకుమ బొట్లు.. చేతుల‌కు తాళ్లు.. ఇలాచెప్పుకొం టూ.. పోతే..నేత‌ల‌కు సెంటిమెంటు కింద లేని, రాని.. అంశం అంటూ ఏదీ ఉండ‌దు. ఇక‌, హిందూత్వ అజెండాను మోసే.. బీజేపీ గురించి ఎంత చెప్పిన త‌క్కువే. ఉత్త‌రాదిలో అయితే.. రామ‌నామ‌స్మ‌ర‌ణ లేకుండా బీజేపీ నాయ‌కులు ఏకార్య‌క్ర‌మాన్నీ ప్రారంభిం చ‌రు. ఇక‌, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏపీ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. తెలంగాణ‌లో నేత‌లు.. మాత్రం చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మిని కొల‌వ‌కుండా.. ఏ కార్య‌క్ర‌మాన్నీ ప్రారంభించ‌డం లేదు.

చార్మినార్ గోడ‌ను ఆనుకుని ఉన్న భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారిని చాలా ప్ర‌త్యేక‌త ఉంద‌ని అంటారు బీజేపీ నాయ‌కులు. దీనిపై అనేక వివాదాలు.. విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. త‌మ ప‌ట్టును మాత్రం నెగ్గించుకుంటున్నారు. భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యాన్ని సంద‌ర్శించ‌డం.. ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డం.. బీజేపీ నేత‌ల‌కు ఇప్పుడు.. ఆల‌వాలంగా మారిపోయింది. మ‌రీ ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజ‌య్‌.. అయితే.. ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌న్నా కూడా ఇక్క‌డి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేయించుకున్నాకే ప్రారంభిస్తున్నారు. తాజాగా కూడా ఆయ‌న ఇదే విధానం అవ‌లంభిస్తుండ‌డంతో భాగ్య‌ల‌క్ష్మి అమ్మవారికి-బీజేపీ నేత‌ల‌కు మ‌ధ్య అనుబంధం చ‌ర్చ‌కు దారితీసింది.

గ‌త మార్చిలో జ‌రిగిన‌ జీహెచ్ఎంసీ  ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ త‌న కార్య‌క‌లాపాల్లో భాగ్యల‌క్ష్మి ఆల‌యాన్ని హైలెట్ చేసింది. త‌మ‌ను గెలిపిస్తే.. ఆల‌యాన్ని మ‌రింత అభివృద్ధి చేస్తామంటూ.. వాగ్దానాలు సంధించింది. ఇక‌, బండి సంజ‌య్ ప‌దే ప‌దే ఆ ఆల‌య ప్ర‌స్తావ‌న తీసుకువ‌స్తూనే ఉన్నారు. అంతేకాదు, త‌మ రాజ‌కీయ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించాల‌న్నా, ప్ర‌మాణాల స‌వాళ్లు చేయాల‌న్నా.. భాగ్య‌లక్ష్మీ ఆల‌యానికే రావాలంటూ బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా విష‌యంలోనూ.. భాగ్య‌ల‌క్ష్మీ ఆల‌య‌మే చ‌ర్చ‌లోకి వ‌చ్చింది.

ఇక ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నిక‌ల పోరాటాన్ని కూడా చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మీ ఆల‌యం నుంచినే ప్రారంభిస్తామ‌ని .. బండి సంజ‌య్ ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే అక్క‌డ నుంచి సంజ‌య్ పాద‌యాత్ర ప్రారంభిస్తార‌ట‌. ఇక్క‌డ మొద‌లుపెట్టి.. హుజూరాబాద్ వ‌ర‌కూ ఆయ‌న త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తార‌ట‌. ఇదే త‌మ గెలుపున‌కు నాంది అవుతుంద‌ని.. క‌మ‌లం పార్టీ నేత‌లు చెబుతున్నారు.. దీంతో బీజేపీ రాజ‌కీయం అంతా.. మ‌హాల‌క్ష్మి ఆల‌యంతో ముడి ప‌డి ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.  తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని ఆల‌యాలు ఉన్నా.. మ‌త‌ప‌రంగా సెన్సిటివ్ వ్య‌వ‌హారం అయినా.. భాగ్య‌ల‌క్ష్మీ ఆల‌యాన్ని బీజేపీ బాగానే వాడుకుంటోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  మ‌రి హూజూరాబాద్‌లో గెలుస్తారో.. లేదో చూడాలి.
Tags:    

Similar News