ఏపీలో బలపడేందుకు బీజేపీ తాజా స్కెచ్

Update: 2019-07-16 04:56 GMT
కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది సరే.. కానీ ఏపీలో దాదాపు 2 లక్షల పైచిలుకు ఓట్లను కూడా ఆ పార్టీ సాధించలేదు. కేంద్రంలో అధికారం చూసుకొని ఏపీలో బీజేపీలోకి చేరమంటే ఎవ్వరూ చేరడం లేదట. నలుగురు టీడీపీ రాజ్య సభ ఎంపీలు  కేసులు, వ్యాపార కోణంలో చేరారని విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత బీజేపీలో చేరికల ఊసే లేదు. క్షేత్ర స్థాయిలోని బలమైన నేతలు, ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీలో చేరడానికి  ఏమాత్రం అంతగా ఆసక్తి చూపించడం లేదట.. ఎందుకంటే ఏపీలో అసలు బీజేపీకి ఓట్లు లేవు.. సీట్లు రావు.. క్యాడర్ లేదు.. నేతలు లేరు..

అందుకే ఇప్పుడు ఏపీలో బలపడేందుకు బీజేపీ తాజాగా స్కెచ్ గీసిందట.. ఏపీ ఆకర్ష్ ను ‘నామినేటెడ్ పదవుల’తో ఉరుకులు పరుగులు పెట్టించేందుకు రెడీ అయ్యిందట.. ఇందులో భాగంగానే ఏపీలోని సీనియర్ నేతలకు నామినేటెడ్ పోస్టులను తాజాగా కట్టబెడుతోంది. ఈ పరిణామంతో బీజేపీలో చేరికకు నేతలకు భరోసాన్నిచ్చినట్టైంది.

తాజాగా ఏపీ బీజేపీ నేత రఘునాథ్ బాబుకు పొగాకు బోర్డు జాతీయ చైర్మన్ పదవిని బీజేపీ అధిష్టానం ఇచ్చింది. ఇది జాతీయ స్తాయిలోనే అత్యంత కీలకమైన గొప్ప పదవి. ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీ ఇలా నేతలకు భరోసా కల్పించి చేరికలను పెంచేందుకే ఇలా నామినేటెడ్ వల విసురుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నో నామినేటెడ్ పోస్టులున్నాయి. కానీ మోడీషాల మేజిక్ తో గెలిచిన బీజేపీలో నేతల కొరత తీవ్రంగా ఉంది. అందుకే ఇప్పుడు ఏపీ నేతలకు కూడా పదవులు ఇచ్చేస్తున్నారు.

ఇప్పటికే ఎయిర్ ఇండియా బోర్డ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా పురంధేశ్వరిని నియమించారు. ఇది స్వతంత్ర పదవి కావడం విశేషం. ఇక మరో బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డిని నెహ్రూ యువకేంద్ర సంఘటన్ వైస్ చైర్మన్ గా నియమించారు. ఇలా ఏపీలోని నేతలందరికీ ఏదో నామినేటెడ్ పోస్టులు కట్టబెడుతూ బీజేపీ నేతలకు భరోసాన్నిస్తోంది. బీజేపీలో చేరితే ఏపీలో లాభం లేదనుకునే వారికి నామినేటెడ్ పోస్టులతో వల విసురుతోంది. మరి ఈ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి మరీ.. కేసులుండవు.. పోస్టులుంటాయి..


Tags:    

Similar News