ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా నుంచి ఎల్వీ సుబ్రమణ్యాన్ని బదిలీ చేయడం మీద భారతీయ జనతా పార్టీ రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఏకంగా ఇందులో మత రాజకీయమే చేయాలనేది బీజేపీ ఉద్దేశంలా కనిపిస్తూ ఉండటం విశేషం.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరిని పెట్టుకోవాలనేది చాలా వరకూ సీఎం విచక్షణను బట్టి పోతూ ఉంటుంది. సీనియారిటీని బట్టి ఆ హోదాలో ఐఏఎస్ అధికారులను పెట్టుకుంటారు. ఇది వరకూ కూడా సీఎస్ లు బదిలీలు అయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి.
ముఖ్యమంత్రికి సన్నిహితులుగా మెలిగిన వారు కూడా బదిలీలు అయ్యారు. వివిధ శాఖలకు వెళ్లారు. అలాగే ఇప్పుడు ఎల్వీ సుబ్రమణ్యం వంతు వచ్చింది. వాస్తవానికి ఈ సీఎస్ ను జగన్ ప్రభుత్వం నియమించుకోలేదు. ఆయన ఎన్నికల సంఘం నియమించబడిన వ్యక్తి.
ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడి అనుకూల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆ బదిలీల్లో నాటి సీఎస్ కూడా ఉన్నారు. ఆ స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఈసీ నియమించింది. ఆ తర్వాత ఎల్వీపై తెలుగుదేశం పార్టీ ఒక రేంజ్ లో ఫైట్ చేసింది కూడా.
జగన్ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో ఎల్వీ సీఎస్ గా కొనసాగారు.ఇప్పుడు బదిలీ అయ్యారు. అయితే ఇప్పుడు కుల,మత రాజకీయాలన్నీ బీజేపీ ఈ విషయంలో రుద్దాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది!
అయినా ఒక అధికారి బదిలీ విషయంలో అలాంటి రాజకీయం ఎంత వరకూ సమంజసం? ఒక అధికారి బదిలీ అయితే ఏకంగా మతం మనోభావాలే దెబ్బతింటాయా? బీజేపీ తీరు పిడుగుకూ బియ్యానికీ ఒకే మంత్రం వేసినట్టుగా లేదా? అనేది విశ్లేషకుల మాట!