దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీకి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 10న తొలి దశ పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తాయిలాల పంపకం ప్రారంభించేసింది. తాయిలాల పంపకంలో కీలక నిర్ణయం తీసుకుంది. బోరు బావులు వినియోగించే రైతులకు ఉపశమనం కలిగించేలా.. విద్యుత్ రేట్లను తగ్గించింది. అన్ని రకాల రేట్లను 50 శాతం తగ్గించింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ రేట్లలో కోత విధించింది. రైతులకు ప్రయోజనం కలిగేలా బోరు బావుల విద్యుత్ ధరలను తగ్గించింది. పట్టణాల్లో మీటరు ఉన్న బోరుబావుల కనెక్షన్ల యూనిట్ ధరను రూ.6 నుంచి రూ.3కు.. గ్రామీణ మీటర్ల పంప్ కనెక్షన్ల యూనిట్ ధరను రూ.2 నుంచి రూ.1కి పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
పట్టణాల్లో ఫిక్స్డ్ ఛార్జీల రేటు హార్స్పవర్కు రూ.130 నుంచి రూ.65కు... గ్రామాల్లో రూ.70 నుంచి రూ.35కు తగ్గించింది. మీటర్లు లేని కనెక్షన్లకు రేటును హార్స్పవర్కు రూ.170 నుంచి రూ.85కు పరిమితం చేసింది.
రైతులు ఆనందంగా ఉంటేనే ఉత్తర్ప్రదేశ్ స్వయం సమృద్ధి సాధ్యమవుతుంది. అందుకే రైతులకు ప్రయోజనాలు కలిగే విధంగా 50 శాతం రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకున్నాం అంటూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. యోగి సర్కార్ నిర్ణయం వల్ల యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్పై రూ.వెయ్యి కోట్ల అదనపు భారం పడనుంది. అయితే.. ఈ తాయిలం.. ఎన్నికలు ముగిసే వరకేనని.. దీనిని రైతులు నమ్మితే.. మోసపోయినట్టేనని విపక్షాలు విమర్శలు గుప్పించాయి.
ఎన్నికలు ముగిసిన తర్వాత.. దీనికి రెండింతలు చార్జీలు వసూలు చేస్తారని కూడా హెచ్చరించడం గమనార్హం. ఇక, కాంగ్రెస్ నేతలు.. మరో అడుగుముందుకు వేసి.. ఎన్నికలు రాగానే యోగికి రైతులు గుర్తుకు వచ్చారంటూ.. ఎద్దేవా చేశారు. లఖింపూర్ ఖేరీ ఘటనలో రైతులపై కారును దూకించిన కేంద్ర మంత్రి కుమారుడిని రక్షించే ప్రయత్నం చేసిన విషయాన్ని రైతులు ఎప్పటికీ మరిచిపోరని కూడా విమర్శలు గుప్పించింది. మరి, ఈ తాయిలంపై రైతులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.