ఇటీవల కర్ణాటకలో చోటు చేసుకున్న పరిణామాలే ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోనే పునరావృతం కాబోతున్నాయా? కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి గద్దె దిగినట్లుగానే.. ఇటు ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ సీఎం పదవి వదులుకోక తప్పదా? అంటే.. అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తన పదవిని వదులుకోక తప్పదనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
కొద్ది రోజుల క్రితం కర్టాటక బీజేపీలో రగిలిన అసంతృప్తి కారణంగా యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎమ్మెల్యేల్లో ఆయనపై పెరిగిన అసంతృప్తి పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో యడ్యూరప్ప సీఎం పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ రాజకీయాల్లోనూ అవే సన్నివేశాలు కనిపిస్తున్నాయి. అక్కడి సీఎం భూపేష్ పదవీ గండాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన మెడపై ఉద్వాసన కత్తి వేలాడుతోంది. సొంత పార్టీకి చెందిన శాసన సభ్యుల నుంచి ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి పనితీరుపై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని సమాచారం. దీంతో ఆయన్ని పదవి నుంచి తప్పించాలనే డిమాండ్‌తో నాయకులు ఢిల్లీ బాట పట్టారు.
పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో భూపేష్ ఢిల్లీ వెళ్లారు. అయితే ఆయనకంటే ముందుగానే ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందరు హస్తినాకు చేరుకోవడం గమనార్హం. ముఖ్యమంత్రిని మార్చుతారనే సమాచారం తనకు లేదని రాహుల్ గాంధీని కలిసిన తర్వాతే ఓ స్పష్టత వస్తుందని భూపేష్ అన్నారు. అయితే ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలు రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ పీఎల్ పునియాతో సమావేశమయ్యారని సమాచారం. మరి వాళ్లు ఆ భేటీలో ఏ విషయాలను చర్చించారో అన్న సంగతి ఇంకా బయటకు రాలేదు.
2018లో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. అప్పుడు భూపేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే రెండున్నరేళ్ల పాటే ఆయన సీఎంగా కొనసాగాలని ఆ తర్వాత మరొకరికి ఆ పదవి ఇవ్వాలనే డిమాండ్ అప్పడు వినిపించింది. దీంతో మొదట భూపేష్.. ఆ తర్వాత మరొకరు సీఎం కుర్చీని పంచుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం షరతు విధించింది. గత నెలతోనే భూపేష్ రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసింది. దీంతో ఆయన రాజీనామా చేసి వేరే వాళ్లకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్‌తో అసంతృప్త ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు. అయితే ఆయన్ని తప్పించిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే విషయంపై అధిష్ఠానం ఓ స్పష్టతతో లేదని సమాచారం. సీఎంగా సింగ్ దేవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరి భూపేష్ భవిష్యత్‌పై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.