తమిళనాడు రాజకీయాలకు ఎప్పుడూ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. సినీ గ్లామర్, కుటుంబ ఆధిపత్యాలు, సెంటిమెంట్, డ్రామా, ఫ్యామిలీ వైరం, ప్రాంతీయవాదం తమిళ ఎన్నికలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ఈసారి విశేషం ఏంటంటే.. గత ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డ ఇద్దరు దిగ్గజ నాయకులు ఈసారి లేరు.మాజీ ముఖ్యమంత్రులు జె. జయలలిత, ఎం కరుణానిధిలు చనిపోయారు. గత తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత రెండోసారి గెలవగా.. కరుణానిధి ఆమె చేతిలో ఓడిపోయారు. కాగా వచ్చే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఇద్దరు లేకపోవడంతో తమిళ పాలిటిక్స్ కళ తప్పింది. పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఈ అవకాశాన్ని కేంద్రంలోని బీజేపీ వాడుకునేందుకు రెడీ అయ్యింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న బిజెపి తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో స్టార్ నేతల కొరతతో రాజకీయ శూన్యత ఏర్పడింది. సహజంగానే, చాలా కాలంగా రాష్ట్రంపై దృష్టి సారించిన బిజెపికి ఇది అవకాశంగా మారింది. కేంద్ర హోంమంత్రి, ప్రధాని నరేంద్ర మోడీ రైట్ హ్యాండ్ అయిన అమిత్ షా తమిళనాడులో పర్యటించడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. అమిత్ షా ఈ పర్యటనలో సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలవవచ్చని ప్రచారం సాగుతోంది.
ఇంతలో అందరి దృష్టి కరుణానిధి పెద్ద కుమారుడు ఎం.కె.అళగిరిపైనే పడింది. అళగిరి కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నారు. అళగిరి వెనుక బిజెపి హస్తం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ అలగిరికి మద్దతు ఇస్తుందని, ఆయన కోసం ఎత్తుగడలు వేస్తున్నట్లు చెబుతున్నారు. అళగిరి కొత్త రాజకీయ పార్టీ ప్రధానంగా ఆయన సోదరుడు, ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ఓట్లను చీల్చడానికే అని అంటున్నారు.. అళగిరి మరియు స్టాలిన్ కరుణానిధి కుమారులు. అయినప్పటికీ, కరుణానిధి తన రాజకీయ వారసుడిగా స్టాలిన్‌కు ఓటు వేశారు. దీన్ని సహించలేని అళగిరి బయటకు వచ్చాడు. స్టాలిన్ డీఎంకేకి వ్యతిరేకంగా అళగిరి అడుగులు వేస్తున్నారు. ప్రత్యర్థులైన ఏఐడీఎంకే, బీజేపీలతో సహవాసానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అళిగిరిని రాజకీయంగా వాడుకునేందుకు ఏఐటీఎంకే, బీజేపీ డిసైడ్ అయినట్లు ప్రచారం సాగుతోంది.
బిజెపి తనను పార్టీలోకి స్వాగతిస్తోందని అళగిరి తాజాగా స్వయంగా పేర్కొన్నారు. దీనిపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. అళగిరి బిజెపిలో చేరితే డీఎంకేకు పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. డిఎంకె ఓట్లను విభజించడానికి కొత్త రాజకీయ పార్టీని అళగిరిని పెట్టినా నష్టం తప్పదు. బిజెపి ఈసారి తమిళనాడు గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తోంది.. కర్ణాటకను కైవసం చేసుకున్న తరువాత, బిజెపి తెలంగాణపై ఎంతో ఆసక్తిగా ఉంది. అక్కడ ఇప్పటికే 4 ఎంపి సీట్లు.. 2 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. తాజాగా దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించింది. మరోవైపు రాబోయే పశ్చిమ బెంగాల్ (2021) మరియు పంజాబ్ (2022) ఎన్నికల గురించి కూడా బిజెపి తీవ్రంగా ఆలోచిస్తోంది.