బీజేపీ ఫోకస్ మధ్యప్రదేశ్ పై పడింది. బోటా బోటీ మెజార్టీతో కొనసాగుతున్న కమల్ నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ రంగం సిద్ధం చేస్తోందన్న ప్రచారం సాగుతోంది. తాజాగా కమల్ నాథ్ సర్కారులోని 10 మంది ఎమ్మెల్యేలను బీజేపీ పాలిత కర్ణాటకలోని బెంగళూరు రిసార్ట్ లకు బీజేపీ నాయకులు తరలించడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది.
బెంగళూరులోని సర్జాపూర్ లోని వివిధ రిసార్ట్ లలో 10మంది మధ్యప్రదేశ్ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు ఉన్నారు. వీరిని బీజేపీ నాయకులు తీసుకొచ్చి కాపాలా కాస్తున్నారు.
అయితే బీజేపీ నేతలు మాత్రం అధికారికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దాచినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. అయితే కాంగ్రెస్ మాత్రం బీజేపీ క్యాంపు రాజకీయాలతో మద్యప్రదేశ్ సర్కారును కూల్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది.
కాగా బెంగళూరు లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో కాంగ్రెస్ నేతలు బెంగళూరు బాట పట్టారు. దీంతో వారిని వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీగా పోలీస్ బందోబస్తును నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అన్న సందిగ్ధత నెలకొంది.