దమ్ముంటే.. నిరూపించండి: కేటీఆర్‌కు బీజేపీ సవాల్.. మునుగోడు పోరు హోరు!
రాజగోపాల్ రెడ్డి కంపెనీలపై మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ సవాల్ విసిరారు. మునుగోడులో బీజేపీ గెలుస్తుందనే కారణంతోనే.. రాజాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే 4 కాంట్రాక్టులు దక్కాయే తప్ప.. బీజేపీ ప్రభుత్వం వల్ల రాలేదన్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ గ్రహించాలని వివేక్ హితవు పలికారు.
రాజగోపాల్ రెడ్డి కంపెనీలపై కేటీఆర్ ఆరోపణలు సరికాదన్నారు. రాజగోపాల్ రెడ్డికి సుప్రీంకోర్టు మార్గదర్శ కాలకు అనుగుణంగానే 4 కాంట్రాక్టులు దక్కాయన్నారు. ఇందులో బీజేపీ నేతలు.. కానీ, ప్రభుత్వం కానీ.. చేసింది ఏమీ లేదన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఎక్కువ ధరకు ప్రాజెక్టులు కట్టబెడితే.. జెన్ కో, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.29 వేల కోట్ల నష్టం వాటిల్లిందని వివేక్ ఆరోపించారు. తప్పుడు ఆరోపణలపై విచారణకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. మునుగోడులో టీఆర్ ఎస్ ఓడిపోతుందనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల తో కలిపి.. 82 మందికి బూత్ స్థాయిలో బాధ్యతలు అప్పగించారని ఎద్దేవా చేశారు.
సోమవారం రోజున నామినేషన్ దాఖలు కోసం రాజగోపాల్ రెడ్డి రిటర్నింగ్ అధికారిని సమయం అడిగినట్లు వివేక్ తెలిపారు. టీఆర్ ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా మునుగోడులో గెలిచేది బీజేపీనేనని వివేక్ ధీమా వ్యక్తం చేశారు.
``మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం. రాజగోపాల్ రెడ్డిపై మీరు ఏవైతే ఆరోపణలు చేశారో వాటికి మేము సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే నిరూపించండి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే రాజగోపాల్ రెడ్డికి టెండర్ వచ్చింది. మునుగోడులో మీరు ఓడిపోతున్నారనే భయంతోనే రాజగోపాల్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.`` అని వివేక్‌నిప్పులు చెరిగారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.