మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద పడిన ముద్ర ఎప్పటికీ పోయేట్లులేదు. కాంగ్రెస్ ఎంఎల్ఏగా రెడ్డి హఠాత్తుగా రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటికి చాలారోజులుగా కాంగ్రెస్ లో ఉంటూనే బీజేపీ నాయకత్వానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద బహిరంగంగానే ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. ఎప్పుడో ఒకపుడు రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోతారని అందరు అనుకుంటున్నదే.
అయితే ఇంత తొందరగా రాజీనామా చేస్తారని అనుకోలేదు. అయినా ఎందుకని రాజీనామా చేసినట్లు ? ఎందుకంటే రు. 18 వేల కోట్ల విలువైన బొగ్గు గనుల కాంట్రాక్టు వచ్చింది కాబట్టి. ఎప్పుడైతే వేలకోట్ల రూపాయల బొగ్గు గనులు రెడ్డికి దక్కాయో వెంటనే కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసేశారు. అంటే కేవలం వేలకోట్ల రూపాయల కాంట్రాక్టు కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని రేవంత్ బహిరంగంగానే ఆరోపించారు. మొదట్లో ఆరోపణలను కొట్టేసినా చివరకు రెడ్డి అంగీకరించాల్సొచ్చింది.
దాంతో రాజగోపాలరెడ్డిపై రు. 18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమని పార్టీకి వెన్నుపోటు పొడిచారనే ముద్ర బలంగా పడిపోయింది. ఇవే ఆరోపణలను ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు టీఆర్ఎస్ చాలా బలంగా జనాల్లోకి తీసుకెళ్ళాయి. దాంతో జనాల్లో కూడా ఇదే విషయమై చర్చ జరిగింది. సో ఇపుడు జరుగుతున్న ఉపఎన్నిక కేవలం రాజగోపాలరెడ్డికి వేల కోట్లరూపాయల కాంట్రాక్టు దక్కిన ఫలితమే అనేది జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది.
దాని ఫలితంగానే రెడ్డి ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా జనాలు తిడుతున్నారు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసం కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశావంటూ మొహం మీద చీ కొడుతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే రాజగోపాలరెడ్డిని అసలు ప్రచారానికే రానీయటం లేదు. రేపటి ఎన్నికల్లో గెలుపోటములు ఎలాగున్నా ఇపుడు రెడ్డి మీద పడిన రు. 18 వేల కోట్ల కాంట్రాక్టు ముద్ర ఎప్పటికీ చెరిగిపోయేట్లుగా లేదు.