బిగ్ బ్రేకింగ్: కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రాజగోపాల్ రెడ్డి.. ఓటమి ఖాయమైందా?

Update: 2022-11-06 05:58 GMT
మునుగోడులో రౌండ్ రౌండ్ కు ఫలితాలు తారుమారు అవుతూ ఉత్కంఠ రేపుతోంది. పోస్టల్, తొలి రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యత సాధించగా.. మూడో రౌండ్ కు వచ్చేసరికి బీజేపీ పుంజుకుంది. 4వ రౌండ్ లో ఏకంగా టీఆర్ఎస్ నుంచి ఆధిక్యత సాధించింది. అయితే 4వ రౌండ్ ముగిశాక బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అనూహ్యంగా కౌంటింగ్ కేంద్రం బయటకు రావడం అందరికీ షాకిచ్చింది. ఓ వైపు ఫలితాలు ప్రకటిస్తుంటే ఇలా అభ్యర్థి బయటకు రావడం ఏంటని అందరూ షాక్ అయ్యారు.

ఇప్పటివరకూ నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యింది. స్వల్ప ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం నుంచి బీజేపీ అభ్యర్థి బయటకు వచ్చారు. ‘చౌటుప్పల్ మండలంలో  అనుకున్న మెజార్టీ రాలేదు’ అని.. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయని చెప్పారు. చివరి వరకూ హోరా హోరీ పోరు తప్పకపోవచ్చన్నారు.

బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ఉందని రాజగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా కౌంటింగ్ కేంద్రం నుంచి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.

అయితే ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండడం.. వ్యతిరేక ఫలితాలు రావడంతోనే అలిగి రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చాడా.? అని అందరూ అనుకుంటున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ 714 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకూ టీఆర్ఎస్ అభ్యర్థికి 26433 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 24729 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 7380 ఓట్లు వచ్చాయి.
Tags:    

Similar News