ప్రజాధనం కోట్లకు కోట్లు ఖర్చు చేసి మరీ నూతనవ్యవస్థ అంటూ పేరు పెట్టి ఏపీ సీఎం జగన్.. ఇంటి వద్దకే రేషన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల రేషన్‌బియ్యం వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. వాటిని ప్రజల మధ్య ఉంచి.. రేషన్‌ను ఇంటికే పంపిస్తామని చెప్పారు. అయితే.. వీటిపై ఇప్పుడు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.
రేషన్ వాహనాలు గడపగడపకు రావడం లేదనేది ఒక వివాదమైతే.. నిర్దేశిత పనిచేయడం మానేసి అమాత్యులు, వైసీపీ నేతల పనులు చేయడంలో వాహనాలు విసుగులేకుండా.. సంచరిస్తున్నాయనేది.. ససాక్ష్యంగా నిరూపించారు బీజేపీ నాయకులు. రేషన్ ను పపేదల ఇంటికి పంపాల్సిన వాహనాల్లో.. ఇప్పుడు ఇటుకబట్టీల్లో.. ఇటుకలను ఈ వాహనాల ద్వారా రవాణా చేస్తున్నారు.
తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏపీ బీజేపీ నాయకులు వెలుగులోకి తెచ్చిన ఫొటో సంచలనంగా మారింది. గతంలోనూ.. సీమలో ఒక అధికార పార్టీనాయకుడి ఇంటికి సరుకులు చేరవేసిన.. ఈ వాహనాలు.. తీవ్ర సంచలనంగా మారాయి. తర్వాత ఏమైందో ఆ డ్రైవర్లను మార్చారుకానీ.. నేతపై మాత్రం చర్యలు తీసుకోలేదు. ఇక, ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.
నిజానికి సీఎం జగన్ అధికారంలోకి వచ్చేనాటికే రాష్ట్రంలో సమర్థవంతంగా రేషన్ దుకాణాలు పనిచేస్తున్నా యి. డీలర్లు కూడా ప్రజలకు సహకరిస్తున్నారు. అనూహ్యంగా వీరిలో సగం మంది టీడీపీ అనుకూల డీలర్లు ఉన్నారనే నెపంతో వారిని తొలగించారు. ఆవెంటనే.. సీఎం జగన్.. రేషన్ వాహనాలు తీసుకువచ్చారు. ఇప్పుడు అవి ఇలా పనిచేస్తున్నాయి!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.