తెలంగాణ సీఎం కేసీఆర్ తిడితే అందరూ చెవులు నిక్కబొడుచుకొని వింటారు. అచ్చ తెలంగాణ మాండలికం.. ప్రత్యర్థులపై దుర్భాషలాడే ఆయన మాటలు వినడానికి మనకు ఇంపుగా ఉన్నా.. ప్రత్యర్థులకు మాత్రం కంపుగా ఉంటాయి. మరి కేసీఆర్ తిడితే పడడమేనా? మేము తిడతామని తిట్లదండకం షూరు చేశారు బీజేపీ నేతలు. కేసీఆర్ ను తాజాగా తిట్టింది తెలంగాణ వాళ్లు కాదు.. ఏపీ బీజేపీ నేతలు..
ఏపీలో కరెంట్ చార్జీల పెంపు, ప్రభుత్వ, దేవాలయ భూముల అమ్మకాలను నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా ఏపీ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇళ్లలోనే నిరసనలు తెలిపారు. దీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఈ దీక్షల్లో జగన్ కంటే తెలంగాణ సీఎం కేసీఆర్ పైనే నేతలు విరుచుకుపడడం విశేషం.
‘రాష్ట్రాలు ఉత్పత్తి చేసే విద్యుత్ కు యూనిట్ కు రూ.4 ఖర్చు అయితే.. కేంద్ర సంస్థలు మాత్రం రూ.2.30కే ఇస్తున్నాయి.. అందుకే కేంద్రం సంస్కరణలు తెచ్చింది. ఇది అర్థం చేసుకోలేని కేసీఆర్.. మందు ఎక్కువై.. మతిపోయిన రీతిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు’ అని ఏపీ బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిప్పులు చెరిగారు.
కేంద్రం నుంచి వచ్చే అన్ని నిధులతో పబ్బం గడుపుతున్న కేసీఆర్.. కేంద్రంపై నోరుపారేజుకోవడం అవగాహన రాహిత్యమని సోము వీర్రాజు మండిపడ్డారు. కేసీఆర్ దద్దమ్మ అని.. బిచ్చగాణ్నని మోడీ ముందు ఒప్పుకోమనండి..కేసీఆర్ ని భాగ్యవంతుడిగా మోడీ మార్చుతాడని సోము వీర్రాజు నిప్పులు చెరిగారు.