అవినీతి బూచి చూపి ప్రజలను మభ్య పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మునుపెన్నడూ లేనన్ని అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్ష్యాలతో సహా దొరుకుతున్నా కూడా ఆయన మాత్రం ఎదుటి వారిని అవినీతిపరులు అని ఆరోపించడం కొందరిని విస్మయానికి గురిచేస్తోంది. పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతిదీ కరెక్టని చెప్పిన చంద్రబాబు నాయుడు.. అయ్యా మీ వద్ద అవినీతి జరుగుతోందో - మీకు తెలుసో లేదో నాకు తెలియదు. జరుగుతున్న మాట వాస్తవం - కాస్త కళ్లు తెరువండి అని విమర్శలు చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా దూషించడం మొదలుపెట్టారు. అవినీతి లేకపోతే దానిని నిరూపించుకునే అవకాశాలు ఉంటాయి. కానీ టీడీపీ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. విమర్శలు చేసిన వారిపై ఆవేశపూరిత వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వ పెద్దలు కాలం గడుపుతున్నారు.
తాజాగా బీజేపీ నేత సోము వీర్రాజు కర్నూలు వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాస్పత్రిలో 90 యంత్రాలు పని చేయడం లేదు. యంత్రాలు పని చేయకపోయినా సీఎం డాష్ బొర్డులో పనిచేస్తున్నట్లు నమోదైంది. ఇదీ బాబు గారి పాలన. అంటే ఆయన డాష్ బోర్డు ఓ పెద్ద అబద్ధం. అది నిజాలు దాచిపెట్టే డాష్ బోర్డు. వాస్తవాలను వక్రీకరించే డాష్ బోర్డు అంటూ వ్యాఖ్యానించారు.
ఈ ఆస్పత్రిలో టీబీఎస్ అనే సంస్థ యంత్ర పరికరాల నిర్వహణ బాధ్యతలు టెండర్ ద్వారా తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ సంస్థకు లబ్ది చేకూర్చారు. 103 కోట్లు మొబిలైజేషన్ ద్వారా ఇవ్వడం, బిల్లుల రూపంలో 45 కోట్లు చెల్లించడం జరిగింది. ఎక్కడైనా అనామక సంస్థకు ఇలా చెల్లిస్తారా? లేదు కదా. మరి ఈ కంపెనీకి ఎందుకు ఇచ్చారంటే కారణమేంటో తెలుసా... అది ఓ మంత్రి గారి బంధువుది. అందుకే దోచిపెడుతున్నారు. ఇప్పటికైనా టీబీఎస్ కాంట్రాక్టు రద్దు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. డాష్ బోర్డు విషయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు మరి ఈ విమర్శ విన్నాక ఏమంటారో చూడాలి.